సినిమా హీరోల మధ్య పోటీ విపరీతంగా పెరిగి పోవడంతో ఏ సినిమాకైనా పాజిటీవ్ టాక్ చాలా ముఖ్యం.  దీనితో తమ సినిమా బాగా వ‌చ్చింది అదిరిపోతుంది అంటూ తాము తీసే సినిమాల పై అంచనాలు పెంచడానికి  ప్రతి సినిమా యూనిట్ తమ వంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం వరస ఫ్లాప్ ల మధ్య కొనసాగుతున్న శర్వానంద్ నటిస్తున్న ‘ర‌ణ‌రంగం’  మూవీ విషయమై శర్వానంద్ అనుసరిస్తున్న వ్యూహాల పై ఈ మూవీ నిర్మాతలు తీవ్ర అసహనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఎలాంటి హైపూ లేకుండా ఈమూవీ గత  ఏడాదిన్న‌రగా సెట్స్‌పై ఉంది. వాస్తవానికి  శ‌ర్వా ఈసినిమాని ఇంత లాగ్ చేయాల్సిన అవ‌స‌రం లేదు అని అంటున్నారు.  ఈమూవీకి సంబంధించిన  టైటిల్‌ ఫ‌స్ట్ లుక్ బ‌య‌ట‌కు వ‌చ్చినా జ‌నాల్లో పెద్ద‌గా క్రేజ్ ఏర్పడటం లేదు. దీనికితోడు ఈమూవీలో శ‌ర్వా ప‌క్క‌న కాజ‌ల్‌ ని ఎంచుకోవ‌డం మ‌రింత డిజెట్వాండేజ్‌ గా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికితోడు శర్వానంద్ ఈమూవీ పై శ‌ర్వా కాస్త నెగిటీవ్‌ గా మాట్లాడుతున్నాడ‌ని వార్తలు వస్తున్నాయి. ‘ఈ సినిమా ఎవ‌రూ న‌మ్మ‌కం పెట్టుకోకండి. ఆడితే ఆడుద్ది లేదంటే లేదు’ అంటూ శర్వానంద్ తన సన్నిహితులతో అంటున్నట్లు టాక్. ఒక హీరో తాను నటించే సినిమా గురించి ఎందుకింత నెగిటివ్ గా మాట్లాడుతున్నాడో శర్వానంద్ సన్నిహితులకే అర్ధం కాని విషయంగా మారింది అని అంటున్నారు. 

గతంలో హీరో నాని కూడ ఇలాగే ‘కృష్ణార్జున యుద్ధం’ స‌మ‌యంలో ఆ సినిమా ఆడ‌క‌పోవొచ్చు అంటూ త‌న స‌న్నిహితుల‌కు హింట్ ఇచ్చినట్లు వార్తలు  వచ్చాయి. నాని అంచనాలకు అనుగుణంగా ఆమూవీ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.   దీనితో శర్వానంద్ ఇలా త‌న సినిమాపై తానే నెగిటీవ్‌గా ఎందుకు మాట్లాడుతున్నాడన్నది ఈ సినిమా దర్శక నిర్మాతలకు అర్ధంకాని విషయంగా మారి శర్వానంద్ పై తీవ్ర అసహనంలో ఉన్నట్లు టాక్. డైరెక్టర్ సుధీర్ వర్మ ఈమూవీని అనుకున్న విధంగా తీయలేకపోతున్న పరిస్థితులలో శర్వానంద్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అని అంటున్నారు.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: