మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గా ఎఫ్-2 సినిమాతో సంచలన విజయం అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వాల్మీకి సినిమా వస్తుంది. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ గా నటిస్తున్నాడు.


పూజా హెగ్దె హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాలో తమిళ నటుడు అధర్వ కూడా నటిస్తున్నాడు. ఈ మూవీని సెప్టెంబర్ 6న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మూడు నెలల్లో వరుస సినిమాలు అలరించనున్నాయి. ఆగష్టు 15న ప్రభాస్ సాహో రిలీజ్ ఫిక్స్ చేయగా అక్టోబర్ 2న సైరా నరసిం హా రెడ్డి సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.


వాల్మీకి సినిమాను కూడా సెప్టెంబర్ మొదటివారం ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మెగా హీరోల్లో రొటీన్ కు భిన్నంగ వెరైటీ సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్ ఫిదా తో కమర్షియల్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తొలిప్రేమ, ఎఫ్-2 తో సూపర్ ఫాంలోకి వచ్చాడు. కోలీవుడ్ లో ఈ పాత్రని బాబి సింహా చేశాడు. అతనికి అక్కడ మంచి పేరు తీసుకొచ్చింది ఈ రోల్.  


ఇప్పుడు అదే పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేర్చుకున్నాడని తెలుస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: