అందాల ప్రదర్శనలో బాలీవుడ్ హీరోయిన్స్ ఎప్పుడో హాలీవుడ్ ను దాటేశారు. ఇన్నర్ అందాలతో రెచ్చిపోతున్నారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా తెలుసు కదా? మోడలింగ్ రంగంలో తన సత్తా చూపించి మిస్ దివా-2015 గా ఎంపికయిన ఈ భామ అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో కూడా పాల్గొంది.  మోడలింగ్ తో పాటుగా బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొని 'సింగ్ సాబ్ ది గ్రేట్'.. 'సనమ్ రే'.. 'గ్రేట్ గ్రాండ్ మస్తి'.. 'హేట్ స్టొరీ 4' లాంటి సినిమాల్లో నటించింది. 


తాజాగా ఊర్వశి ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది.  జూన్ ఎడిషన్ కవర్ పేజ్ కోసమే ఈ స్పెషల్ ఫోటో షూట్ చేసిందట.  ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫోటో గ్రాఫర్ డబూ రత్నాని. ఆయన బాలీవుడ్ లో ఫేమస్ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్. ఆయన ఫోటోలకు మహా డిమాండ్ ఉంటుంది.  ఆ స్టాండర్డ్ కు తగ్గట్టే కవర్ పేజి ఫోటోలో ఊర్వశి రెడ్ కలర్ జాకెట్ ధరించి స్టైల్ గా నిలడింది. 


బటన్స్ పెట్టుకోకుండా ఉండడంతో హాట్ గా ఉన్న బ్లాక్ ఇన్నర్ కనిపిస్తోంది. బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ లో ఉన్న హెయిర్ ఊర్వశికి మోడరన్ లుక్ ఇచ్చింది. మేకప్ పర్ఫెక్ట్ గా ఉండడంతో కవర్ పేజికి కొత్త అందం వచ్చింది. ఈ మ్యాగజైన్ లో ఊర్వశి పై 'ఫ్రమ్ రా టూ ర్యావిషింగ్" అంటూ ఒక కథనం కూడా ప్రచురించారు. ఈ ఫోటోకు ఇన్స్టా లో సూపర్ రెస్పాన్స్ అదిరింది. "బ్యూటీ క్వీన్.. సెన్సువల్ పోజ్".. "బోల్డ్ అండ్ బ్యూటిఫుల్".. "బాలీవుడ్ గరం మసాలా".. "ఆమేజింగ్ ఫోటో గ్రఫీ.. అన్ బీటబుల్ బ్యూటీ" అంటూ నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: