గతంలో బాలకృష్ణ రైతుగా చాలా సినిమాలు చేశాడు.  పంచె, తలపాగా.. చేతిలో కర్ర పట్టుకొని పొలంలోకి దిగితే.. రైతుగా మారిపోతాడు.  తన నటనతో అదరగొడతాడు అనే టాక్ ఉంది.  ఇటీవల కాలంలో బాలకృష్ణ రైతుగా చేసిన సినిమాలు చాలా తక్కువ.  తక్కువ అని కూడా చెప్పలేం. అసలు ఆ సినిమాలు చేయలేదు.  


ఎందుకు చేయలేదు అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇటీవల బాలకృష్ణ రైతు కథతో సినిమా చేయటానికి ముందుకు వచ్చాడు.  అందులో ఓ రోల్ కోసం అమితాబ్ సంప్రదించారు.  ఆ సినిమాలో చేసేందుకు అమితాబ్ నిరాకరించడంతో ... సినిమాను పక్కన పెట్టేశారు బాలకృష్ణ.  అమితాబ్ ఒకే అంటేనే సినిమాను ముందుకు తీసుకెళ్లాలి అన్నది బాలయ్య ప్లాన్.  


ఇకపోతే.. బాలకృష్ణ రైతు కథతో సినిమాలు చేయడంలో వెనుకబడిపోతే.. యువ హీరో మహేష్ బాబు రైతు కథతో చేసిన మహర్షి సూపర్ హిట్ కొట్టింది.  రైతుల సమస్యలపై స్పందించిన తీరు అందరికి నచ్చింది.  సినిమా వందకోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  యూనిట్ కాన్సెప్ట్ కావడం సినిమాకు ప్లస్ అయ్యింది.  


అలాగే తమిళంలో సూపర్  హిట్టైన విజయ్ కత్తి సినిమాను మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 గా రీమేక్ చేశారు.  ఈ రీమేక్ సినిమా అదిరిపోయింది.  అంతేకాదు,రైతుల ఆందోళన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ భారీ హిట్టైంది.  ఇప్పుడు మెగాస్టార్ కొరటాల దర్శకత్వంలో రైతులకు సంబంధించిన సినిమా రాబోతున్నది.  హీరోలంతా రైతుల సినిమాలు చేసుకుంటూ పోతుంటే అప్పట్లో రైతుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న బాలకృష్ణ మాత్రం వెనకబడిపోయారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: