శ్రీదేవి అంటే వర్మకు ఎంతటి ప్రేమ ఉన్నదో చెప్పక్కర్లేదు. ఎందుకు అంతటి ప్రేమ అంటే చెప్పలేడు.  ప్రేమ మాత్రం పీకలదాకా ఉన్నది.  అలా ప్రేమించిన శ్రీదేవిని పెళ్లి చేసుకోమన్నది అని చెప్పి ఎవరైనా వర్మ దగ్గరికి వచ్చి చెప్తే ఊరుకుంటాడా చెప్పండి. 


జెడి విషయంలో ఇదే జరిగింది.  జెడి వర్మకు ప్రియాశిష్యుడు.  వర్మ దర్శకత్వంలో సినిమాలు చేశాడు.  జెడి దర్శకుడిగా వర్మ నిర్మాతగా మారి సినిమాలు చేశారు. అంతా బాగుంది.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు అన్నది వాస్తవం.  


జెడి చక్రవర్తి గులాబీ సినిమా చెన్నైలో షూటింగ్ జరుగుతున్నది.  అక్కడ షూటింగ్ జరిగే సమయంలో అందులో హీరోయిన్ శ్రీదేవి చెల్లెలు చెన్నైలోని శ్రీదేవి ఇంట్లోనే ఉండేదట.  అయితే, ఓరోజు జెడి, శ్రీదేవి ఇంటికి వెళ్ళాడు.  అతిధిగా వచ్చిన జేడీకి శ్రీదేవి భోజనం వడ్డిస్తోంది. 


ఈలోగా శ్రీదేవి వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి.. మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని అడిగిందట. దీంతో జెడి షాక్ అయ్యాడు.  అప్పటికే శ్రీదేవికి పెళ్లి అయ్యింది.  అమ్మకు బాగాలేదని ఏ విషయం ఎక్కువ సేపు గుర్తుపెట్టుకోలేదని చెప్పింది శ్రీదేవి.  ఈ విషయం వర్మతో చెప్తే జేడీతో గొడవపడ్డాడట.  ఆఛాన్స్ తనకు రాలేదని.  



మరింత సమాచారం తెలుసుకోండి: