నిర్మాతగా సినిమాలకు దూరంగా ఉంటున్న బండ్ల గణేష్ కు ఊహించని అదృష్టాలు ఒకదాని వెంట మరొకటి వస్తున్నాయి. మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ లో కామెడీ పాత్రను పోషిస్తున్న బండ్ల గణేష్ కు ఇప్పుడు ఏకంగా ‘బిగ్ బాస్ 3’ నిర్వాహకుల నుండి పిలుపు రావడం షాకింగ్ న్యూస్ గా మారింది. 

ఇప్పటికే త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ షోలో రేణు దేశాయ్ హౌస్ మేట్ గా పాల్గోనబోతోంది అని వస్తున్న వార్తలకు తోడు ఇప్పుడు బండ్ల గణేష్ వార్తలు కూడ రావడంతో ‘బిగ్ బాస్ 3’ పై మరింత ఆసక్తి పెరుగుతోంది. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు బండ్ల గణేష్ పెట్టిన కండిషన్స్ బిగ్ బాస్ నిర్వాహకులకు కొరుకుడు పడటం లేదు అని టాక్. 

తాను ‘బిగ్ బాస్ 3’ షోలోకి రావడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదనీ అయితే తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం రోజుకు కనీసం ఒక్కసారి తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుకునే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇంచుమించు ఇదేరకం కండిషన్ రేణు దేశాయ్ దగ్గర నుంచి కూడ రావడంతో ‘బిగ్ బాస్ 3’ నిర్వాహకులు ఈ విషయమై తమ అసక్తతను వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. 

ఈ నేపధ్యంలో ఈషోలో పాల్గొనే లిస్టులో ఒకనాటి హీరో తొట్టెంపూడి వేణుని కూడ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒకప్పుడు క్రేజీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ పేరు కూడ వినిపిస్తున్న నేపధ్యంలో ఈసారి ‘బిగ్ బాస్ 3’ సీజన్ లో పేరున్న వ్యక్తులు చాలామంది కనిపించే అవకాశం ఉంది. నాగార్జున ఈ షోకు హోస్ట్ గా ఫిక్స్ అయినప్పటికీ ఈ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలలో ఏవో కొన్ని సమస్యలు ఎదురౌతున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: