మనకు తెలిసి చేస్తే తప్పు.. తెలియకుండా జరిగితే పొరపాటు.. మనతో సంబంధం లేకుండా జరిగితే దాన్ని ఏమంటారు.. హ్యాకింగ్ అనే అంటారు.  ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్ అయ్యింది.  మెగాస్టార్ అమితాబ్ స్థానంలో పాక్ పీఎం ఫోటో అక్కడ పోస్ట్ అయింది.  

అంతేకాదు.. డిస్క్రిప్షన్ స్థానంలో ఐలవ్ యు పాకిస్తాన్ అని రాసిపెట్టుంది.  దీన్ని చూసి షాక్ అయ్యాడు అమితాబ్.  ఈ దుశ్చర్యకు టర్కీ కి చెందిన ఆయిల్ డిజ్ టిమ్ అనే హ్యాకర్ పాల్పడ్డాడు. ఇతడు అమితాబ్ అకౌంట్ ని హ్యాక్ చేయడంతో పాటు ప్రొఫైల్ పిక్చర్ గా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటో పెట్టడం గమనార్హం. 

అమితాబ్ బయోడేటా లో “ఐ లవ్ పాకిస్తాన్” అనే స్లోగన్ తో పాటు, టర్కిష్ జాతీయ పతాకం ఉన్న ఎమోజి ని చేర్చారు. ఈ విషయం గమనించిన అమితాబ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పాటు, సదరు బయోడేటా, ప్రొఫైల్ పిక్చర్ ని తొలగించారు. 

ఐతే టర్కీ కి చెందిన ఈ హ్యాకర్ గ్రూప్ ఇలాంటి సైబర్ అటాక్స్ ఇంకా జరుగుతాయని ఓ బెదిరింపు ట్వీట్ చేయడం గమనార్హం. ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి.  సెలెబ్రిటీల అకౌంట్స్ హ్యాక్ జరగడం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: