ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తరువాత సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.  వరసగా రెండు సినిమాలు ప్లాప్ కావడంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలి అనే డౌట్ తో ఉన్నారు.  ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న బాలయ్య మంచి కథ కోసం ఎదురు చూశారు.  

ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ బోయపాటితో సినిమా చేయాలని అనుకున్నాడు.  బడ్జెట్ వలన సినిమా పోస్ట్ ఫోన్ అయ్యింది.  చివరికి బోయపాటితో కాకుండా, కెఎస్ రవికుమార్ తో ఒకే అయ్యింది.  రవికుమార్ సినిమాలో బాలకృష్ణ ఓ పవర్ ఫుల్ నెగెటివ్ రోల్ లో ఉండే పాత్రను చేయబోతున్నారట.  

ఈ సినిమాకు క్రాంతి అనే టైటిల్ ను పెట్టబోతున్నారని అనుకున్నారు.  అంతకు ముందు రూలర్ అనే టైటిల్ ను పెడతారని అనుకుంటే.. అది కాదని తేలిపోయింది.  ఈ రెండు టైటిల్స్ లో ఏది సినిమాకు టైటిల్ గా పెడతారో చూడాలి.  మరో రెండు రోజుల్లో ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది.  

ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా గురించి అనేక మార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు.  కెఎస్ రవికుమార్ తో సినిమా చేస్తే హిట్ అవుతుందో లేదో తెలియదు.. కాబట్టి బోయపాటితో చేయాలనీ.. లేదంటే ఎవరితోనైనా కొత్త హీరోతో సినిమా చేయాలని అభిమానులు కోరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: