నయనతార సౌత్ లో టాప్ హీరోయిన్.  శ్రీరామా రాజ్యం తరువాత రిటైర్ అవుతున్నానని ప్రకటించిన కొన్ని రోజుల తరువాత, ప్రభుదేవాతో ప్రేమ, పెళ్లిని పక్కన పెట్టి తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  సెకండ్ ఇన్నింగ్స్ సూపర్బ్ గా ఉండటం విశేషం.  

తమిళంలో వరసగా హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది.  తెలుగు తమిళ కన్నడ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు, రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ తో కలిసి ఏథేన్స్ కు వెళ్ళింది.  అక్కడి నుంచి శాంటోరి వెళ్తూ తన ఫోటోలను పోస్ట్ చేసింది.  

ఫ్లైట్ బోర్డింగ్ పాస్ లను షేర్ సోషల్ మీడియాలో షేర్ చేసి లవ్ సింబల్ ను పెట్టింది.  ఈ ఫొటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  విగ్నేష్ కు.. నయనతారకు ఎప్పుడో మ్యారేజ్ అయ్యిందని, నయన్ కెరీర్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉందని అందుకే బయటపెట్టడం లేదని అంటున్నారు.  

ఏదైతేనేం.. నయనతార సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నది.  తెలుగులో మెగాస్టార్ తో సైరా చేస్తున్న ఈ హీరోయిన్, తమిళంలో సోలో సినిమాలు చేస్తూ వరస హిట్స్ కొడుతున్నది.  నయనతార తో సినిమా చేస్తే తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకం.


మరింత సమాచారం తెలుసుకోండి: