ఎప్ప‌టిక‌ప్పుడు విభిన్న‌మైన పాత్ర‌లు  ఎంచుకుంటూ న‌టుడుగా త‌న సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటూ ఆడియ‌న్స్ ను  ఆక‌ట్టుకుంటోన్న హీరో ఆర్య‌.  ఆ కోవ‌లోనే భారీ బడ్జెట్ తో  మ‌రో విభిన్న‌మైన చిత్రం `క‌దంబ‌న్` లో హీరోగా న‌టించాడు.  హీరోయిన్ గా కేథ‌రిన్ థెరిస్సా న‌టించింది. రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం త‌మిళంలో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించి ఆర్య కెరీర్ లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన చిత్రంగా  నిలిచింది. 

ఈ చిత్రాన్ని ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర ఫ్రేమ్స్  ప‌తాకంపై భార‌తి  వరప్రసాద్  వ‌డ్డెల్ల స‌మ‌ర్ప‌ణ‌లో  ఉద‌య్ హ‌ర్ష వ‌డ్డెల్ల నిర్మాత‌గా  `గ‌జేంద్రుడు` పేరుతో తెలుగులోకి అనువ‌దిస్తున్నారు.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 21న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సంద‌ర్బంగా   నిర్మాత ఉద‌య్ హ‌ర్ష వ‌డ్డెల్ల మాట్లాడుతూ...`` హీరో ఆర్య అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డు. హీరోగా , విల‌న్ గా త‌ను తెలుగులో అద్భుమైన సినిమాలు చేశారు. అలాగే అందాల తార కేథ‌రిన్ ,ఆర్య స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టించింది.

వీరిద్ద‌రి జంట తెర‌పై క‌నువిందు చేస్తుంది. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించి..క్రిటిక్స్ నుంచి మంచి ప్ర‌శంస‌లు అందుకున్న చిత్ర‌మిది. ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా హీరో హీరోయిన్స్  న‌టించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్ కి గురి చేసేలా ఉంటుంది. ఆర్య ఈ సినిమా కోసం వెయిట్ పెర‌గ‌డ‌మే కాకుండా షూటింగ్ స‌మ‌యంలో ఆ కొండ‌ల్లో ఎంతో శ్ర‌మించి షూటింగ్ చేశారు.  భారీ బడ్జెట్ తో  నిర్మితమైన ఈ సినిమాకు మ‌రో హైలెట్ గా యువ‌న్ శంక‌ర్ రాజా మ్యూజిక్ ఉంటుంది. ఈ నెల 21న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: