బిగ్ బాస్ రియాలిటీ కానీ రియాలిటీ షో.  ఈ మాట ఎందుకనాల్సి వచ్చింది అంటే.. చూడటానికి రియల్ గా జరుగుతున్నట్టు అనిపిస్తుంది.  అందులో పాల్గొనే వ్యక్తులకే అది గేమ్ అని తెలుస్తుంది.  ఎక్కడో హాలీవుడ్ లో మొదలైన ఈ రియాలిటీ గేమ్ ఎఫెక్ట్.. బాలీవుడ్ కు వచ్చింది.  

బాలీవుడ్ లో 12 సీజన్స్ పూర్తి చేసుకుంది.  అక్కడ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు.  సౌత్ లో ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తయ్యాయి.  మొదటి సీజన్ లో ఎన్టీఆర్ మెప్పిస్తే.. సెకండ్ సీజన్లో నాని అనుకరించారు.  మూడో సీజన్ హోస్ట్ ఎవరు అనే దానిపై అనేక ప్రశ్నలు ఉదయించాయి.  

ఫైనల్ గా నాగార్జున కన్ఫమ్ అయ్యాడు.  నాగార్జున రాకతో బిగ్ బాస్ కు కళ వస్తుంది అనడంలో అందేహం లేదు.  ఈనెల మూడో వారం నుంచి ఈ షో ప్రారంభం అవుతుంది.  బిగ్ బాస్ హౌస్ కంటిస్టెంట్స్ గా రష్మీ,శ్రీముఖి, ఉదయభాను, సావిత్రి, రేణు దేశాయ్, హేమ చంద్ర, గుత్తా జ్వాలా, పొట్టి రమేష్, మనోజ్ నందన్ , వరుణ్ సందేశ్.. ఇలా చాలా పేర్లు వినిపించాయి.  

వీరితో పాటు నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ పేరు కూడా వినిపించింది.  బండ్ల గణేష్ హౌస్ కంటెస్టెంట్ గా ఉంటున్నాడు అనే సరికి ఎవరికి అర్ధం కాలేదు.  కానీ, గణేష్ మాత్రం ఈ షో లో చేయడం లేదని, సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్టు చెప్పారు.  అలాగే, ఎన్నికల సమయంలో ప్రజాశాంతి పార్టీని స్థాపించి అందరికి ఆకట్టుకున్న కెఏ పాల్ కూడా ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నాడు అని తెలిసే సరికి అంతా షాక్ అయ్యారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: