నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం " గ్యాంగ్ లీడర్". ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అట. ముందుగా విలన్ క్యారెక్టర్ కి   ఫేమ్ కార్తికేయని అనుకున్నారు. అతనికి యూత్ లో మంచి ఫాలోయింగ్ వచ్చిన మాట నిజమే. కానీ మొన్న వచ్చిన ’హిప్పీ’ తో అతని అసలు రంగు బయటపడింది.

నటన సరిగ్గా రాదు కాబట్టి చొక్కా విప్పి బాడీ చూపిస్తూ కానిచ్చేసాడు హిప్పీలో. ఒకవేళ కార్తికేయ హీరో అయ్యుంటే ఈ గ్యాంగ్ లీడ సినిమాకి బాగా ప్లస్ అయ్యుండేది. కానీ ’హిప్పీ’ సినిమాతో అతను పూర్తిగా ఫేమ్ కోల్పోయాడనే చెప్పాలి. ఇప్పుడు ఇతన్ని విలన్ గా పెట్టుకుంటే సినిమాకి ఏదైనా నష్టం వాటిల్లుతుందేమోనని ఆలోచిస్తున్నారు.

ఇప్పుడు కార్తికేయ వల్ల ఈ సినిమాకి అదనపు మైలేజి అస్సలు రాదు. కానీ కార్తికేయకి ఈ సినిమా చాలా హెల్ప్ అవుతుంది. హీరోగా తప్ప క్యారెక్టర్ ఆర్టిస్టు లాంటి పాత్రలు చెయ్యను అని షరతులు పెట్టుకోకుండా ఉంటే అతని కెరీర్ కే మంచిది.

ఇక ఈ సినిమా భారం అంతా ఒక్క నానినే చూసుకోవాలి.  కార్తికేయ వల్ల ఒరిగేదేమీ ఉండదు కాబట్టి, మరింత జాగ్రత్తతో సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చెరుకుంది. ఆగస్టు నెలాఖరులో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: