ఇటీవల ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసాడు. మద్రాసు నుండి తెలుగు సినిమా పరిశ్రమ వేరయ్యాక సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాదులోనే ఉందని, పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలన్ని ఇక్కడే ఉన్నాయని పేర్కొన్నారు.

అయితే 2014 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్తా ఆంధ్ర, తెలంగాణగా విడిపోవడంతో తెలుగు సినిమా కార్యకలాపాలన్నీ హైదరాబాదు కేంద్రంగా తెలంగాణలోనే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో  ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలైనా నవ్యాంధ్ర వేదికగా జరగాలనే డిమాండ్ పెరిగింది.

గత ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో ఆ డిమాండ్స్ పరిగణలోకి రాలేదు. అయితే ఇప్పుడు యువ ముఖ్యమంత్రిగా జగన్ రావడంతో ఈ అంశం మరోసారి తెరమీదకి వచ్చింది.

దీనిపైనే సురేష్ బాబు స్పందిస్తూ వైజాగ్ లో స్టూడియోలు నిర్మించడానికి సినీ ఇండస్ట్రీ సుముఖంగా ఉందని చెప్పారు. ఈ అంశంపై జగన్ స్పందించి ప్రభుత్వ నిర్ణయం చెబితే స్టూడియోల నిర్మాణం పెద్ద విషయం కాదని తేల్చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: