అల్లు అర్జున్ 19 వ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  సంక్రాంతికి రిలీజ్ చేయలనే లక్ష్యంతో షూట్ చేస్తున్నారు.  ఇందులో పూజా హెగ్డే ఒక హీరోయిన్ కాగా మరో హీరోయిన్ గా తెలుగమ్మాయిని తీసుకున్నారని సమాచారం.  


ఇదిలా ఉంటె, బన్నీ సినిమా ఎలా ఉండబోతుంది.. దానికి సంబంధించిన లుక్స్ ఏవైనా రిలీజ్ చేశారా అంటే లేదనే అంటారు.  ఫాదర్ సెంటిమెంట్ తో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది.  జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా సెంటిమెంట్ తరహాలో వచ్చిందే. 


కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  ఇందులో అల్లు అర్జున్ లాంగ్ హెయిర్ తో ఫార్మల్ డ్రెస్ తో మేడలో ఒక ట్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక పూజా హెగ్డే నడుచుకుంటూ వస్తుంది.  ఇది షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫోటో లా ఉన్నది.  


ఈ ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది.  గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.   గతంలో వచ్చిన రెండు సినిమాల కంటే ఈ సినిమా చాలా వరకు మరింత సెంటిమెంట్ గా ఉంటుందని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: