సినిమాలకి కాపీరైట్స్ ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారింది. ఒకరి దగ్గరి నుండి కాపీరైట్స్ తీసుకుంటే ఇంకొకరు వచ్చి ఇది నా కథ అని గోల చేస్తుంటారు. ఇటువంటి విషయాల్లో డైరెక్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి.

తాజాగా నయనతార్ కొత్త సినిమా ’కోలైయుతీర్ కలాం’ ఇటువంటి సమస్యలోనే ఇరుక్కుంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాకు ’బిల్లా 2 ఫేమ్’  చక్రి తోలేటి దర్శకత్వం వహించారు. జూన్ 14 న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ సినిమాని తమిళ రచయిత ’సుజాతా రంగరాజన్’ నవల ఆధారంగా తీసినట్లు తెలిసింది. ఇటీవల వచ్చిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ఒక కీలక పాత్రలో ’ భూమిక’ నటించింది.

కాగా  నవల హక్కుల్ని 10 లక్షలు ఇచ్చి సుజాతా రంగరాజన్  భార్యనుండి కొనుగోలు చేసానని దర్శకుడు బాలాజీ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశారు.

ఇది కాపీరైట్స్ ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ సినిమా విడుదల చేయకుండా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. మంగళవారం బాలాజీ పిటిషన్ ని పరిశీలించిన కోర్టు సినిమా విడుదలను  నిలిపివెయ్యాలని తాత్కాలికంగా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21 న చిత్ర నిర్మాతలు వివరణ ఇవ్వాలని పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: