నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అబ్బాయిల నుండి అసభ్య సందేశాలు వస్తున్నాయని బాలీవుడు నటుడు ’అర్జున్ మాథుర్’ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్జున్ మాథుర్ ఇటీవల విడుదలైన ’యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ’ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాత్ర పోషించారు.

ఈ పాత్ర ద్వారా అతను పాపులారిటీని బానే సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల అర్జున్ ’మేడ్ ఇన్ హెవెన్’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇందులో అతడిది స్వలింగ సంపర్కుడి పాత్ర. ఈ సినిమా విడుదలయ్యాక చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నరట.

నెటిజన్ల కామెంట్లతో ఇన్ బాక్స్ నిండిపోయిందని చెప్పాడు. చాలామంది అబ్బాయిలు తనకి మెసెజ్ చేసి నన్ను పెళ్ళి చేసుకుంటావా అని అడుగుతున్నారట. ఈ విషయాన్ని అతడు మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

గతంలో రెండు మూడు సినిమాల్లో అర్జున్ ’గే’ గా నటించినప్పటికి ఎప్పుడు ఇటువంటి కామెంట్స్ రాలేదంట. ఇప్పుడు వెబ్ సిరీస్ పుణ్యమా అని అతనికి కొంతకాలం ఈ తిప్పలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: