పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరులోనే ఒక ప్రభంజనం ఉంటుంది, ఇక అయన సినిమా విడుదల అవుతుందంటే చాలు అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు అనే చెప్పాలి. అయితే ఆయనకు టాలీవుడ్ నటీనటుల్లో కూడా కొందరు అభిమానులున్న విషయం తెలిసిందే. ఇక అయన అభిమానిగా తోలి చిత్రం నుండి పవన్ అంటే ఎంతో ఇష్టపడే నటుడు యంగ్ హీరో నితిన్. అంతేకాక తన సినిమాల్లో పవన్ మ్యానరిజమ్స్ మరియు పవన్ సాంగ్స్ ని రీమిక్స్ వంటివి నితిన్ తన సినిమాల్లో చేయడం ఇదివరకు మనం చూసాము. 

తనకు తల్లితండ్రులు జన్మనిస్తే, సినిమాల్లోకి వచ్చి మంచి స్థాయికి ఎదిగేలా ఇన్స్పిరేషన్ ని ఇచ్చింది మాత్రం తన అభిమాన నటుడు పవన్ కల్యాణే అని నితిన్ ఎప్పుడూ చెపుతూ ఉంటాడు. ఇకపోతే ఆ మధ్య ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో వరుస విజయాలు అందుకున్న నితిన్, ఇటీవల త్రివిక్రమ్ తో చేసిన అఆ రూపంలో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తరువాత ఎన్నో అంచనాల మధ్య నితిన్ నటించిన లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక అప్పడినుండి నితిన్ మంచి హిట్ కోసం ఎంతో ప్రయత్నిస్తూ మంచి కథకోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక ఎట్టకేలకు కొన్నాళ్ల క్రితం చలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుములు దర్శకత్వంలో కొత్త చిత్రం, భీష్మను నేడు మొదలెట్టడం జరిగింది. 

గీత గోవిందం భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సింగల్ ఫర్ ఎవర్ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ సినిమా, ఒక డిఫరెంట్ పాయింట్ తో తెరకెక్కనున్నట్లు సమాచారం. అందరిని ఆకట్టుకునేలా మంచి ఎంటర్టైనర్ గా సినిమాని రూపొందిస్తాం అని దర్శకుడు వెంకీ అంటున్నారు. మరి హిట్ కోసం పాపం ఎన్నో పట్లు పడుతున్న పవన్ ఫ్యానైన నితిన్ కు భీష్మ రూపంలో ఎంతవరకు విజయం లభిస్తుందో వేచి చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: