టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఏదైనా సినిమాలో ఉన్నారంటే చాలు ఆ సినిమాలో విపరీతంగా నవ్వులుపూస్తాయి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అంతేకాదు కొన్ని హిట్ అయిన సినిమాల్లో కేవలం బ్రహ్మి కామెడీ పండడం వల్లనే మంచి కలెక్షన్లు సాధించినవి చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఇకపోతే ఇదివరకటితో పోలిస్తే బ్రహ్మానందం సినిమాలు కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక ఇటీవల అనారోగ్య కారణంగా ఆయనకు గుండె ఆపరేషన్ కూడా జరిగిన సంగతి తెలిసిందే.

అయితే ఆపరేషన్ తరువాత మొన్న దివంగత ఎస్వీఆర్ గారి జీవితంపై పుస్తకం విడుదల సందర్భంగా బయటకు వచ్చిన బ్రహ్మానందం, కెరీర్లో మొదటిసారి ఒక బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు, ఒకరకంగా ఇదే ఆయనకు కంబ్యాక్ మూవీ కానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఈ సినిమా హర్రర్ మరియు థ్రిల్లింగ్ సస్పెన్స్ జానర్ లో సాగుతుందని, అంతేకాక ఈ సినిమాలో శృంగార తారగా పేరుగాంచిన సన్నీలియోన్ హీరోయిన్ గా నటిస్తోందని నిన్నటినుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ద్వారా కేవలం బ్రహ్మి మాత్రమే కాదు, కమెడియన్ మరియు హీరో అయిన సునీల్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించనున్నాడట. 

ఇకపోతే ఈ సినిమాకు ప్రసాద్ తాతినేని దర్శకత్వం అవకాశం వచించనున్నట్లు సమాచారం. కథ, కథనాలు మరియు సినిమాలో తమ పాత్రలు నచ్చడంతోనే బ్రహ్మానందం మరియు సునీల్ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారని అంటున్నారు. మరి ప్రస్తుతం అటు టాలీవుడ్ ఇటు మీడియా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎంతవకు నిజం ఉందొ తెలియాలంటే ఆ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే....!!


మరింత సమాచారం తెలుసుకోండి: