మిర్చి సినిమా సూపర్ హిట్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించిన బాహుబలి రెండు భాగాలు ఒకదానిని మించి ఇంకొకటి అద్భుత విజయాలను అందుకోవడంతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ మరియు ఫాలోయింగ్ ని సంపాదించారని చెప్పాలి. అయితే ఆ సినిమాల తరువాత ప్రభాస్ మార్కెట్ కూడా అమాంతం బాలీవుడ్ హీరోల స్థాయికి పెరగడంతో ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చే నిర్మాతలు కూడా ఎక్కువగా ఆయనతో భారీ చిత్రాలు చేయాలనే చూస్తున్నారట. అయితే బాహుబలి విజయాల్లో రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ఎంతైతే ఉందొ, హీరో ప్రభాస్ అద్భుత నటన మరియు ఆ పాత్ర కోసం ఆయన పడ్డ శ్రమ అంతే ఉందని చెప్పవచ్చు. 

అయితే ఇప్పటివరకు విడుదలైన తెలుగు సినిమాల్లో మొత్తం ఓవర్ అల్ కలెక్షన్ల పరంగా బాహుబలి 2 సినిమా తెలుగు వర్షన్ కు రూ.310 కోట్ల షేర్ సాధించి ప్రధమ స్థానంలో ఉండగా, రూ.183 కోట్ల షేర్ తో బాహుబలి 1 సినిమా రెండవ స్థానంలో ఉంది. ఇక ఆ తరువాత నాన్ బాహుబలి రికార్డుగా రంగస్థలం సినిమా రూ.116 కోట్లతో మూడవ స్థానంలో నిలిచింది. ఇదిగో ఇక్కడే, ఇప్పుడు ప్రేక్షకులు మరియు కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఒక కొత్త చర్చను లేవనెత్తారు. నిజానికి నాన్ బాహుబలి రికార్డుగా ఉన్న రంగస్థలం రికార్డును మాత్రమే కాక బాహుబలి రెండుభాగాల తెలుగు వర్షన్ రికార్డును మళ్ళి ప్రభాస్ సాహో తో బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. 

అయితే కొందరు ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నదానిని బట్టి చూస్తే సాహోకు విడుదల కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది కాబట్టి, మొదటిరోజు హిట్ టాక్ ని సొంతం చేసుకుంటే మాత్రం బాహుబలి 2 మరియు బాహుబలి 1 మధ్య ఓవర్ ఆల్ గా సాహో కలెక్షన్లు నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో బాహుబలి 2 రికార్డుని ఓవర్ ఆల్ గా బీట్ చేయడం కొంత కష్టం అనేది వారి భావన. అయితే అది ఖచ్చితంగా చెప్పలేమని, ఒకవేళ అన్ని కలిసివస్తే సాధ్యం కూడా అయ్యే అవకాశం లేకపోలేదని మరికందరు అంటున్నారు. ఏదిఏమైనా సాహో ద్వారా ప్రేక్షకుల ముందుకు త్వరలో రాబోతున్న ప్రభాస్ కు కలెక్షన్ల రూపంలో అతి పెద్ద పరీక్షే ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరీక్షలో మన బాహుబలి ఎంతటి సక్సెస్ ని సాధిస్తాడో తెలియాలంటే మరికొద్దిరోజుల్లో వేచిచూడాల్సిందే...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: