సినీ నటుడు వరుణ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.  ఆయన ప్రయాణిస్తున్న  కారును  మరో  కారు బలంగా ఢీకొట్టింది.  ఈ ప్రమాదం నుంచి హీరో వరుణ్ తేజ్  క్షేమంగా బయటపడ్డారు.

 

వివరాల్లోకి వెళితే..  హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు వనపర్తి జిల్లా   కొత్తకోట మండలం  రాయని పేట వద్ద ప్రమాదానికి గురైంది.  హైదరాబాద్ నుంచి బెంగళూరుకు  షూటింగ్ కోసం వెళ్తుండగా  ఈ ప్రమాదం జరిగింది. 

 

వరుణ్ తేజ్ కారును  మరో కారు ఢీకొట్టింది.  ప్రమాదంలో రెండు కార్లు  బాగా దెబ్బతిన్నాయి.  వరుణ్ తేజ్  చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు.  అక్కడినుంచి  వేరే  కారులో ఆయన బెంగళూరు వెళ్లారు.  ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు నా ఊపిరి పీల్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: