తమన్నా తన 14 వ సంవత్సరం నుంచి సినిమాల్లోకి వచ్చింది.  ఇప్పటికి ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నది.  హీరోయిన్ గా అనేక సినిమాలు చేసింది.  టాప్ హీరోలందరితో ఈ హీరోయిన్ మూవీస్ చేసింది.  ఎన్ని సినిమాలు చేసినా.. వాళ్ళకంటూ ఒక మెయిన్ గోల్ ఉంటుంది కదా.  


ఈ గోల్ ను రీచ్ అయ్యేందుకు చాలా కష్టపడుతుంటారు.  తమన్నాకు కూడా అలాంటి డ్రీం రోల్ ఒకటి ఉందట.  అదే శ్రీదేవి బయోపిక్ రోల్.  శ్రీదేవి బయోపిక్ లో నటించాలన్నది తన కోరిక అట.  ఆమె సినిమా కనుక వస్తే అందులో తనను ఎంచుకుంటే బాగుంటుందని అంటోంది.  


అయితే, బోనీకపూర్ మాత్రం శ్రీదేవి బయోపిక్ చేసే ఆలోచనలో లేరని చెప్పేశారు.  ఆమె బయోపిక్ ను నిర్మించే ఆలోచన తమకు లేదని, అలాంటి సాహసం చేయబోనని ఇప్పటికే స్పష్టం చేశారు.  బోనీకపూర్ మాటలను బట్టి చూసుకుంటే.. పాపం తమన్నా కోరిక నెరవేరేలా కనిపించడం లేదుగా.  


ప్రస్తుతం తమన్నా తమిళ, హిందీ సినిమాల్లో బిజీగా ఉంది.  ఓ డ్యాన్స్ బేస్డ్ సినిమాలో నటించాలనే కోరిక కూడా ఈ అమ్మడికి ఉంది.  మరి ఆ కోరికైనా తీరుతుందా లేదా. ఎఫ్ 2 తరువాత తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేయలేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: