ఇవాలా రేపు మన చుట్టూ ఉన్న  అమ్మాయిలే బోల్డ్ గా ఉంటున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఉన్న వారి సంగతి చెప్పనక్కరలేదు. పూర్తి స్వేచ్చగా జీవిస్తున్నారు. వారి అభిప్రాయాలను కూడా ఎక్కడా దాచుకోకుండా కుండబద్దలు కొడుతున్నారు. బుల్లి తెర మీద ఓ సెన్సేషన్ యాంకర్ శ్రీముఖి


మరి ఆమె తన వ్యక్తిగత విషయాలను లైవ్ చాటింగులో అభిమానులతో పంచుకుంది. పటాస్ షో తో మంచి ఫ్యామస్ అయిన శ్రీముఖి సినిమాల్లో కూడా వేషాలు వేస్తోంది. తనకు సినిమాల్లో మంచి రోల్స్ రావాలని కోరుకుంటున్న ఈ అమ్మడు మందు కొట్టే అలవాటు తనకు ఉందని చెప్పి అభిమానులకే షాక్ తినిపించింది.


మామూలుగా ఇవన్నీ నాచురల్ అనుకున్నా ఎవరూ ఎక్కడా బయటపడరు. మరి అక్కడ ఉన్నది శ్రీముఖి కదా అందుకే తన మనసులోని మాటను అలా బయటపెట్టేసింది. నిజాయతీగా చెప్పీనందుకు మెచ్చుకోవాల్సిందే మరి. ఇక విలన్ రోల్స్ తనకు ఇష్టమని చెబుతున్న ఈ ముద్దు గుమ్మ చాన్స్ దొరికితే లేడీ విలన్ గా వెండి తేర మీద వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తానని అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: