తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ 'జయలలిత' జీవితం ఆధారంగా, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథాకథనాలతో తమిళ డైరెక్టర్ 'ఏ ఎల్ విజయ్' దర్శకత్వంలో 'తలైవి' అనే టైటిల్ తో జయలలిత బయోపిక్ ను రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. కాగా జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ బయోపిక్ కోసం ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంటుందట ఈ బాలీవుడ్ క్వీన్. 
 
 
 
అయితే.. ఈ సినిమాలో పలు ఆసక్తికరమైన విషయాలు కూడా ఉంటాయట. ముఖ్యంగా రాజకీయంగా జయలలిత పై జరిగిన కుట్రలు, అసెంబ్లీలో ఆమె పై జరిగిన దాడుల్లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది, అలాగే శోభన్ బాబు - జయలలిత మధ్య అనుబంధం పై వచ్చిన రూమర్స్ లో వాస్తవం ఎంత.. లాంటి అంశాలను మొత్తం ఉన్నది ఉన్నట్లుగా విజయేంద్ర ప్రసాద్ తెలుసుకొని రాశారట.
 
 
 
అలాగే, విజయేంద్ర ప్రసాద్ కథ రాసే ముందు జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానాన్ని కూడా కథలో హైలెట్ చేస్తూ కథ రాశారట. వాటిల్లో ప్రధానంగా తమిళ రాజకీయాలను జయలలిత ఎలా శాసించారు ? ఆ క్రమంలో ఆమె ఎదురుకున్న సమస్యలు ఏమిటి ? అతి సామాన్యమెన వ్యక్తులకి టికెట్లు ఇచ్చి ఎలా గెలిపించుకోగలిగారు ? లాంటి అంశాలను ప్రధానంగా తీసుకోని ఈ స్క్రిప్ట్ రాశారట. మొత్తానికి అమ్మ బయోపిక్ లో ఆమె జీవితంలోని ఎవ్వరికీ తెలియని విషయాలు కూడా తెలియనున్నాయి. కాగా ఈ బయోపిక్ తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: