మొదటిసారి రోజా ఎమ్మెల్యేలుగా ఎంపికైనా కూడా జబర్దస్త్ షోను వదలలేదు.  వరసగా ఆ షోను చేశారు.  పైగా సభ నుంచి సస్పెన్స్ అయ్యాక పూర్తి సమయం జబర్దస్త్ కు కేటాయించారు.  ఇప్పుడు అది కష్టం అని తేలిపోయింది.  రోజా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం లేనట్టుగానే కనిపిస్తోంది.  

దీనికి కారణాలు బోలెడు ఉన్నాయి.  రిజల్ట్ వచ్చి.. మంత్రి పదవుల లిస్ట్ బయటకు వచ్చిన తరువాత ఆమె పేరు లేకపోవడంతో.. జబర్దస్త్ లో రోజా ఉంటుంది అనుకున్నారు.  కానీ, అనూహ్యంగా ఆమెను ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి ఇవ్వడంతో బిజీ అవుతారు అనే సంగతి తెలుసు.  

రోజా రాజకీయాల్లో బిజీ  అయితే.. జబర్దస్త్ ను వదిలేసుకున్నట్టే అవుతుంది.  రెండింటిని హ్యాండిల్ చేయాలంటే కష్టం.  రాజకీయంగా ఆమె ఎదగాలని అనుకుంటోంది.  రాజకీయాల్లో ఫుల్ టైమ్ ఉంటూ.. కొంత సమయం మాత్రమే తన సొంత కార్యక్రమాలకు కేటాయించనుంది.  

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ అంటే మామూలు పదవి కాదు.  అది కూడా క్యాబినెట్ ర్యాంకే.  మంత్రి పదవితో సమానం కాబట్టి రోజా ఆ పోస్ట్ తో బిజీ అవుతారు.  ఈ సమయంలో జబర్దస్త్ కు తన సమయాన్ని కేటాయించడం కష్టం అవుతుంది.  ఒకవేళ అలా చేస్తే ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడి జరిగే అవకాశం ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: