యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సాహో. బాహుబలి రిలీజ్ టైం లో ఇట్స్ షో టైం అని సర్ ప్రైజ్ చేసిన ప్రభాస్ ఆగష్టు 15న సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న సాహోలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.


ఇక కొద్ది నిమిషాల క్రితం రిలీజైన ఈ టీజర్ చూస్తే యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా వావ్ అనేలా ఉంది. అదిరిపోయే యాక్షన్ ఘట్టాలతో ఓ హాలీవుడ్ సినిమా ట్రీట్ ఇచ్చేలా ఉంది సాహో. తెలుగు సినిమాకు హాలీవుడ్ కళ తెచ్చేలా సాహో సినిమా తెరకెక్కింది. టీజర్ లో ప్రభాస్ లుక్, స్టైల్ అదిరిపోయాయి.


ఇక చేజింగ్ సీన్ అయితే మెస్మరైజ్ చేస్తున్నాయి. జస్ట్ 1:38 నిమిషాల గల టీజరే ఇలా ఉంటే ఇక రెండున్నర గంటల సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ప్రభాస్ సాహో మరో సెన్సేషన్ అవడం ఖాయమని టీజర్ చూస్తే చెప్పొచ్చు. నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ కు పండుగ చెసుకునేలా ఉందని చెప్పొచ్చు.


ఇన్నాళ్లు బాలీవుడ్ ధూమ్ సీరీస్ లను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రాలేదని అనుకుంటున్న తెలుగు ప్రేక్షకులకు సాహో సినిమా ఆ కిక్ ఇస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టామినా పెంచేలా సాహో పర్ఫెక్ట్ మూవీ అయ్యేలా ఉంది. యాక్షన్ సీన్స్ అయితే సినిమాకు ప్రధాన బలంగా అనిపిస్తున్నాయి.  




మరింత సమాచారం తెలుసుకోండి: