సాహో సినిమాకు సంబంధించి వస్తున్న అప్డేట్స్ అసలే చాలా తక్కువ. పైగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ మొదట్నుంచి దుబాయ్, అబుదాబిలో తీసిన సన్నివేశాల చుట్టూనే ప్రచారం సాగుతోంది. ఫస్ట్ లుక్స్ నుంచి షేడ్స్ ఆఫ్ సాహో పేరుతో విడుదల చేసిన మేకింగ్ వీడియో వరకు అన్నీ ఈ షెడ్యూల్ లోనివే. ఇప్పుడు టీజర్ లో కూడా అవే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం 11 గంటల 23 నిమిషాలకు విడుదల చేసిన సాహో టీజర్ లో దుబాయ్, అబుదాబి షెడ్యూల్స్ కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యం ఇచ్చారు. 


సినిమా కథ, హీరో క్యారెక్టరైజేషన్ ను పూర్తిగా పక్కన పెట్టి..ప్రొడక్షన్ వాల్యూస్, భారీతనం, స్టన్నింగ్ విజువల్స్ పై దృష్టిపెడుతూ టీజర్ ను రిలీజ్ చేశారు. కేవలం దుబాయ్, అబుదాబి షెడ్యూల్ కోసమే 70 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు నిర్మాతలు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్, ఇంటర్నేషనల్ ఎక్విప్ మెంట్ తో ఆ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారని సమాచారం. బిజినెస్ లో భాగంగా చాలామంది బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, బయ్యర్లకు ఈ ఎపిసోడ్ నే చూపించారట. ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ లో కూడా వాటినే ఉంచడం వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలీలేదు.


ఇక ఈ సినిమా నుంచి తప్పుకున్న సంగీత దర్శకులు శంకర్-ఎహసాన్-లాయ్ పేర్లను ఇప్పటికే పోస్టర్ల నుంచి తొలిగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్  చేసిన టీజర్ లో కూడా వాళ్ల పేర్లు లేకపోవడం అందరిని ఆశ్చర్యపరిచే విషయం. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది సాహో. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: