విజయ్ దేవరకొండ-రష్మిక మందన హీరో..హీరోయిన్స్ గా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'డియర్ కామ్రేడ్'. విజయ్ నటించిన అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళి అంతటి క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే ఈ సినిమా ముందు అనుకున్న ప్రకారం ఇప్పటికే విడుదల అవ్వాల్సింది. కాని కొన్ని సీన్స్ రీ షూట్ తో పాటు వేరే ఇతర విషయాల కారణంగా ఈ సినిమాను ఆలస్యంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించారు. జులైలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ పై భారీ అంచనాలున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ అవుతుందని సమాచారం. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. 

అయితే డియర్ కామ్రేడ్ విడుదల కాబోతున్న సమయంలోనే హాలీవుడ్ మూవీ 'ది లయన్ కింగ్' అనే సినిమా కూడా రాబోతుంది. ఈ నేపథ్యంతో అందరి అంచనాల నడుమ రాబోతున్న 'ది లయన్ కింగ్' ఓవర్సీస్ లో కలెక్షన్లు కుమ్మేయడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికాలో ఈసినిమాకే ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి డియర్ కామ్రేడ్ కు ఓవర్సీస్ లో ఎక్కువ థియేటర్లు దొరకకపోవడమే కాక అందరు 'ది లయన్ కింగ్' వైపే మొగ్గు చూపుతారని అంటున్నారు. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు పోటీగా చాలా సినిమాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండకు పెద్దగా పోటీ ఇవ్వగల హీరోలు ఎవరు లేరు కాని ఒక వేళ ఏ సినిమా అయినా క్లిక్ అయితే డియర్ కామ్రేడ్ కలెక్షన్స్ లో కోత పడే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే డియర్ కామ్రేడ్ కు ఓవర్సీస్ తో పాటు ఇక్కడ కష్టమే.

మంచి సినిమాకు మంచి విడుదల తేదీ దక్కితేనే ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టగలదు. ఇప్పుడు డియర్ కామ్రేడ్ విడుదల తేదీ విషయమై బయ్యర్లు మార్చాలంటూ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ముందు అవేవి పని చేయవని నిర్మాతలు మాత్రం చాలా ధీమాగా ఉన్నట్లుగా ఉన్నారు. ఏదేమైనా సినిమాలో మంచి కంటెంట్ ఉంటే మాత్రం ఏ సినిమాలు పోటీ పడలేవు అనేది కూడా గతంలో చాలా సార్లు ప్రూవ్ అయిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: