కాలాలు కూడా అలా కనురెప్పతో శాసితే మారిపోతాయి. ఒక్క సెకన్ అలా ఓర చూపు విసిరితే చలి కాస్తా గిలి ఐపోతుంది. ఎండలో వానలు, గుండెల్లో మంటలు పుట్టించాలంటే వారికి వారే సాటి. ఇంతకీ విషయమెనటంటే మలయాళం భామ అను ఇమ్మాన్యుయేల్ లేటెస్ట్ గా పెట్టిన ఓ పిక్ ఇపుడు తెగ వైరల్ అవుతోంది.
.


 ఈ అమ్మడు అందాన్ని అలా గుమ్మరించేసి  తనకేం సంబంధం అన్నట్లుగా పెట్టిన ఫోజ్ కి  యూత్ దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. అను అంటేనే హాట్ బ్యూటీ. ఈ ముద్దు గుమ్మ  నాని 'మజ్ను' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి   అతి తక్కువ సమయంలోనే పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి'.. అల్లు అర్జున్ 'నాపేరు సూర్య'సినిమాల్లో ఆఫర్లు పట్టేసి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ రెండు సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి.  ఆ తర్వాత ఎంతో నమ్మకంపెట్టుకున్న 'శైలజారెడ్డి అల్లుడు' కూడా దెబ్బేసింది. దీంతో అను టాలీవుడ్ జర్నీ స్లో అయింది. 


అయితే ఈ హిట్లు ఫ్లాపుల గోలతో సంబంధం లేకుండా ఈ జెనరేషన్ హీరోయిన్ల లాగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.  తరచుగా ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజనులను.. అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. అందులో భాగంగా పెట్టిన లేటెస్ట్ పిక్స్ అను ఇమ్మాన్యుయేల్ సత్తా ఎంటో చెబుతున్నాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు 46 డిగ్రీల వేసవి ఎండలతో చస్తూంటే మళ్ళీ ఇంతకు ఇంతా హీట్ పుట్టించడం తగునా అనూ అంటూ రిప్లై ఇస్తున్నారు. అది చాలుగా అను హీట్ ఏ రేంజిలో ఉందో.


మరింత సమాచారం తెలుసుకోండి: