ఆ మద్య తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పెద్ద ఎత్తున జరుగుతుందని నటి శ్రీరెడ్డి ఉద్యమం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.  ఆమె ఉద్యమం తీవ్ర తరం అవుతున్న సమయంలో పవన్ కళ్యాన్ జోలికి వెళ్లడం..విమర్శల పాలు కావడం..పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేయడం పెద్ద దుమారం చెలరేగింది.  దాంతో శ్రీరెడ్డి చెన్నై వెళ్లిపోయింది..ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా సెలబ్రెటీలను ఏకిపడేస్తుంది. 


ఇక బాలీవుడ్ లో మీ టూ ఉద్యం కొనసాగుతుంది..దక్షిణాదిన ప్రముఖ సింగర్ చిన్మయి ఈ ఉద్యమంపై స్పందించి గతంలో తనపై సినీ రచయిత వైర ముత్తు లైంగిక దాడి చేశారని సంచలన ఆరోపణ చేసింది.  సాధారణంగా సెలబ్రెటీలు ఏ విషయంలో పోస్టింగ్ చేసినా తర్వాత వారికి రివర్స్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ మద్య సమంత '1 నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబు కాలి దగ్గర హీరోయిన్ ఉందని మండిపడింది.  అమ్మాయిలను తక్కువగా చూస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.  


ఇటీవల చైతూ- సమంత నటించిన ‘మజిలీ’ మూవీలో ఒక పాటలో నాగచైతన్య కాలికి దణ్ణం పెట్టి కళ్లకు అద్దుకుంటుంది. దీంతో నెటిజన్లు సమంతని టార్గెట్ చేశారు. ఇప్పుడు చిన్మయిని టార్గెట్ చేశారు నెటిజన్లు.  ఆ మద్య ''వయసు మళ్లిన  హీరోలు తమ సినిమాలలో కూతురు వయసుండే హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోజరుగుతూనే ఉంది. ఇది ఇంకా ఆగలేదు.. ఆగిందా..?'' అంటూ ఓ  పోస్ట్ పెట్టింది. 


ఇప్పుడు ఆమె భర్త రాహూల్ రవీంద్ర దర్శకత్వంలో వస్తున్న ‘మన్మధుడు2’టీజర్ నిన్న లాంచ్ అయ్యింది..నాగార్జున వయసు 59  తన వయసులో సగం కంటే తక్కువ ఉన్న హీరోయిన్లతో లిప్ లాక్ ముద్దులు..రొమాన్స్ విచ్చలవిడిగా చేస్తున్నాడు. మరి ఇప్పుడేమంటావ్.. అంటూ నెటిజన్లు చిన్మయిని టార్గెట్ చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం అప్పట్లో పోస్ట్ లు పెట్టి ఇప్పుడు తన భర్త అలాంటి పనులు చేస్తుంటే ప్రోత్సహిస్తుందని ఆమెని ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి చీప్ పబ్లిసిటీ కోసం వెంపర్లాడడం సిగ్గుగా లేదా..?అంటూ దుమ్ముదుళుపుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: