అవును చూస్తూంటే అలాగే అనిపిసోంది. లేకపోతే అదేంటి. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇలాగే జరుగుతోంది. అప్పట్లో వరసగా కమెడియన్లకు ఇలాగే జరిగింది. ఒక్కొక్కరుగా వరసగా చనిపోయారు. మళ్ళీ ఇపుడు మరో యాంటీ సెంటిమెంట్ టాలీవుడ్ ని పట్టి పీడిస్తోంది.
విషయానికి వస్తే టాలీవుడ్ హీరోలను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. యాక్షన్ సీన్స్‌లో నటిస్తూ ఒకరు..జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరొకరు..ఒకరి తర్వాత ఒకరు గాయాలపాలవుతున్నారు. వైజాగ్‌లో జరుగుతున్న షూటింగ్లో హీరో ‘నాగ శౌర్య’ గాయపడిన ఘటన మరిచిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.
తాజాగా హీరో సందీప్ కిషన్ కూడా గాయమైంది. కర్నూలులో ‘తెనాలి రామకృష్ణ’ చిత్రం షూటింగ్ జరుపుకొంటోంది. ఫైట్ మాస్టర్ పొరపాటుతో బాంబ బ్లాస్ట్‌లో సందీప్‌కు గాయమైంది. వెంటనే ఇతడిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనతో టాలీవుడ్ ఉలిక్కిపడుతోంది.
ఇలా వరుస ప్రమాదాలపై టాలీవుడ్లో కలకలం రేపుతోంది. యాక్షన్ సీన్లతో టాలీవుడ్ స్టార్లు కేక పుట్టిస్తున్నారు. ఈ సీన్స్ తీసే సమయంలో గాయాల పాలవుతున్నారు. కొన్ని రోజులుగా హీరోలు గాయాల బాట పడుతున్నారు. ఋఋఋ షూటింగ్లో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు గాయాలయ్యాయి. చాణక్య మూవీ షూటింగ్లో గోపిచంద్ గాయపడ్డాడు. వైజాగ్ షూటింగ్లో నాగ శైర్యకు గాయాలు అయ్యాయి. మళ్ళీ టాలీవుడ్ కి ఏమైంది అన్న భయం బెంగ ఇపుడు పట్టుకున్నాయి. అసేలే సెంటిమెంట్లు పట్టింపులు ఎక్కువగా ఉన్న లోకం సినీ లోకం.