పాము పగ పడితే తట్టుకోవచ్చు. పడుచు అందం పగ పడితే మాత్రం మటాషే. అది చరిత్ర చెప్పిన సత్యం. హాట్ బ్యూటీలు పెట్టే పొగతో ఉక్కిరి బిక్కిరి అయ్యే యూత్ హార్ట్స్ తెలుసు. తాము స్వర్గానికి, నరకానికి మధ్య ఉన్నామని. అలా చంపేస్తూ అంతలోనే బతికిస్తూ చిత్ర వధే చేస్తారుగా.


విషయానికి వస్తే సోఫీ చౌదరి ఇండియన్ కాదు.  ఇంగ్లాండ్ భామ.  బాలీవుడ్ హాటు నటీమణులలో పేరెన్నికగన్న ఘాటు అందం. మొదట్లో ఎంటీవీ వీజే గా పనిచేసింది.  ఝలక్ దిఖ్లాజా 7 లో పార్టిసిపెంట్.  కత్తి లాంటి డ్యాన్సర్.. కిరాక్ సింగర్.  అంతే కాదు పాప కు ఎన్ని భాషలు వచ్చుట.బాలీవుడ్ లో కనీసం ఒక డజన్ సినిమాల్లో నటించింది. '1 నేనొక్కడినే' లో లండన్ బాబు పాటకు స్టెప్పులేసింది.  భాషలు.. పాటలు.. డ్యాన్సులు కాకుండా సోషల్ మీడియాలో హీటు పెంచడంలో పీహెచ్ డీ పట్టా కూడా ఉంది.


ఇపుడు అదే కుర్ర కారు కొంప ముంచుతోంది. లేటెస్ట్ గా ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది సోఫీ చౌదరి పగ పట్టేశా. పంతం నాదే. మీ అంతం నాదే అంటూ కుర్రోళ్ళ వెంట పడుతూంటే వారికి వేరే దారీ తెన్నూ కనిపించడంలేదుగా. మరీ ఇంతలా రెచ్చిపోతే మేము చచ్చిపోవాల్సిందే అంటున్నారుట. అదీ సోఫీ చౌదరి పవరంటే.



మరింత సమాచారం తెలుసుకోండి: