రోజా, గీతాంజలి, బొంబాయి వంటి అద్భుతమైన చిత్రాలు రూపొందించి దర్శకుడిగా తనకంటూ భారతీయ చలచిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు కాసేపటి క్రితం గుండెపోటు రావడంతో, గుర్తించిన కుటుంబ సభ్యులు, వెంటనే ఆయనను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్ర్రీకి తరలించడం జరిగింది. అయితే అనంతరం ఆయనను పరీక్షించిన వైద్యులు, ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారట. 

ఇక గతంలో మణిరత్నంకు 2004లో తాను తెరకెక్కిస్తున్న యువ షూటింగ్ సమయంలో హఠాత్తుగా ఛాతి నొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు చిత్స అందించడంతో అయన కోలుకున్నారు. ఇక ఆ తరువాత 2015లో ఓకే బంగారం షూటింగ్ సమయంలో కాశ్మీర్లో మరొక్కసారి ఆయనకు గుండెపోటు రావడంతో అప్పుడు కూడా సకాలంలో చికిత్స చేయించడంతో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఇక ఆ మధ్య మళ్ళి ఆయనకు గుండెపోటు రావడం జరిగిందని పలు వార్తలు పుకారవడంతో అయన కుటుంబసభ్యులు మాత్రం వాటిని ఖండించారు. ఇకపోతే మళ్ళి నేడు ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించామని ఈమేరకు అయన పిఆర్ టీమ్ సమాచారం ఇచ్చింది. 

అయితే అయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఒక బులెటిన్ విడుదల చేసేవరకు తాము కూడా ఏమి చెప్పలేము వారు అంటున్నారు. ఇకపోతే మణిరత్నం ఎప్పటినుండో తీయాలనుకున్న ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియన్ సెల్వం చిత్ర పనుల్లో ఆయన ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు సమాచారం. ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఇందులో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇక మణిరత్నం గుండెపోటు వార్త తెలియగానే పలువురు చిత్ర ప్రముఖులు అయన ఆరోగ్యంపై వాకబు చేసినట్లు తెలుస్తోంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: