అర్జున్ రెడ్డి  సినిమా సూపర్ డూపర్ హిట్ అయి విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ స్టార్ ను చేసింది. అదే కోవలో ఆర్ ఎక్స్ 100  చిత్రం  ద్వారా తొలి హిట్ అందుకున్న కార్తికేయ కూడా వర్ధమాన హీరోల్లో  మంచి ఇమేజే సంపాదించుకున్నాడు. కానీ విజయ్ మాదిరిగా సినిమా కథల విషయం లో కార్తికేయ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కన్పించడం లేదు. కేవలం తన బాడీ చూపిస్తే సినిమా  హిట్ అవుతుందని ఈ కుర్ర హీరో నమ్ముతున్నట్లు కన్పిస్తోంది.


 ఆర్ ఎక్స్ 100 సినిమా కథలో విషయం ఉంది కాబట్టి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆర్ ఎక్స్ 100  తరువాత  కార్తికేయ నటించిన హిప్పీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నది. ఈ సినిమా కథలో అసలు విషయమేమి లేదని, అందుకే ఆడియన్స్ సినిమా ను తిరస్కరించార న్న టాక్ ఫిల్మ్ సర్కిల్లో విన్పిస్తోంది. కార్తికేయ హిప్పీ డిజాస్టర్ తరువాత చేస్తోన్న చిత్రం గుణ 369 .


ఈ సినిమా ను  నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల రూపొందిస్తున్నాడు. చిత్ర టీజర్ ను సోమవారం సినిమా విడుదల  చేసింది. టీజర్ చూస్తుంటే సినిమా కథ కొత్తదేమీ కాదనిపిస్తోంది. కొత్తదనం లేని కథతో దర్శకుడు ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. కార్తికేయ కు గుణ 369 మరొక హిప్పీ అవుతుందా? లేక ఆర్ ఎక్స్ 100 అవుతుందా అన్నది  త్వరలోనే తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: