ఒక చిత్ర నిర్మాణ సంస్థ 55 సంవత్సరాలుగా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతూ సినిమాలు తీయడం అంటే అందరికీ సాధ్యపడే పనికాదు. అలాంటి అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్న సురేశ్ ప్రొడక్షన్స్ ఈమధ్యనే తమ సంస్థ ప్రారంభించి 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో నిర్మాత సురేశ్ బాబు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ పై ప్రస్తుత తరం హీరోల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు.

తమ నిర్మాణ సంస్థ కార్యక్రమాలు ఎన్టీఆర్ నటించిన ‘రాముడు భీముడు’ సినిమాతో తన తండ్రి రామానాయుడు ప్రారంభించిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఎన్టీఆర్ తో తమ మొదటి సినిమాను తీసినా అతరువాత తిరిగి ఎన్టీఆర్ తో సినిమా తీయలేకపోయిన విషయం వెనుక కారణాలను వివరించాడు. తమ తండ్రి రామానాయుడుకు అందరి టాప్ హీరోలతో పరిచయాలు ఉన్నా ఏనాడు వారి డేట్స్ కావాలని అడిగిన సందర్భాలు లేవనీ అలా అడిగి తమవద్ద డేట్స్ లేవు అనిపించుకోవడం తమ తండ్రికి నచ్చదు అన్న విషయాన్ని సురేశ్ బాబు వివరించాడు. 

ముఖ్యంగా తమ కుటుంబానికి చిరంజీవి బాలకృష్ణలతో ఉన్నంత సాన్నిహిత్యం ఇండస్ట్రీలో వేరెవ్వరికీ లేకపోయినా వారి ఇమేజ్ ని ఉపయోగించుకుని డబ్బు గణించాలి అన్న కోరిక తనకు కానీ తన తండ్రికి కానీ అప్పుడు ఇప్పుడు లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో తమకు ఎంతో పరిచయం ఉన్నా సినిమాలు చేసే విషయంలో ఒక 6 నెలలు ఆగండి ఆతరువాత డేట్స్ ఇస్తాం అన్న మాట ఎంతటి టాప్ హీరోల చేత అయిన అనిపించుకోవడం తన తండ్రి ఒక అవమానంగా భావించే వారు అంటూ సురేశ్ బాబు చేసిన కామెంట్స్ వారి కుటుంబ ఆత్మస్థైర్యాన్ని సూచిస్తున్నాయి. 

వాస్తవానికి వెంకటేష్ ను హీరోగా చేయాలని తన తండ్రి ఎప్పుడు అనుకొలేదనీ ఒక టాప్ హీరో డేట్స్ విషయంలో వచ్చిన తేడాతో అప్పట్లో అమెరికాలో ఉన్న వెంకటేష్ ను తన తండ్రి రామానాయుడు పిలిపించి హడావిడిగా హీరోచేసిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే అనుకోకుండా జరిగిన ఆ సంఘటన తమకు అదేవిధంగా వెంకటేష్ కు ఎంతో మేలు చేసింది అని చెపుతూ టాప్ హీరోలతో సినిమాలు చేయడం కన్నా చిన్న సినిమాలు తీయడం సులువు అంటూ సురేశ్ బాబు చేసిన కామెంట్స్ వెనుక అనేక అర్ధాలు ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: