సమ్మర్ హాలిడేని తన భార్య పిల్లలతో ఎంజాయ్ చేసి హైదరాబాద్ తిరిగి వచ్చిన మహేష్ ఈ నెలాఖరుకు ప్రారంభం కాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఈ పరిస్థుతులలో మహేష్ తన అభిమానులకు మరింత జోష్ ను కలిగించడానికి సోషల్ మీడియాలో తన అభిమానులతో ఇంటరాక్షన్ లోకి వచ్చి అనేక ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. 

తన దృష్టిలో వేగంగా సినిమాలు చేయాలి అన్న కోరిక తనకు ఎప్పుడు లేదని సినిమాల కౌంట్ గురించికంటే తాను నటించే సినిమాలలో విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన అభిమానులను మెప్పించడమే తన కోరిక అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు మహేష్. ఇదే సందర్భంలో తన దర్శకుల గురించి మాట్లాడుతూ తాను తన దర్శకులకు పూర్తిస్వేచ్చ ఇవ్వడమే కాకుండా వారి బాధ్యతలలోకి తాను తల దూర్చనని తనకు దర్శకుడు చెప్పినట్లుగా నటించడం వచ్చు కాని తనకు దర్శకత్వం చేసే సమర్ధత లేదు అంటూ తన పై తానే జోక్ చేసుకున్నాడు.

తాను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయిన విషయాన్ని గుర్తుకు చేకుంటూ ఇంత సుధీర్ఘ కాలంలో తాను నటించిన సినిమాలు కేవలం 25 మాత్రమే అని లెక్క తేలినప్పుడు తాను వేగంగా సినిమాలు ఎందుకు చేయలేక పోయాను అంటూ ఒకొక్కసారి తన పై తనకే కోపం వస్తుంది అంటూ జోక్ చేసుకున్నాడు. ఇక తన కెరియర్ గురించి మాట్లాడుతూ తన ప్రధాన బలం నమ్రత మాత్రమే అని చెపుతూ ఆమె లేకుంటే తన సూపర్ స్టార్ స్టేటస్ లేదు అంటూ ఆ సక్తికర కామెంట్స్ చేసాడు. 

అయితే మారుతున్న పరిస్థుతులు వల్ల కాబోలు మహేష్ తన సినిమాల విషయంలో ఇప్పుడు వేగం పెంచి ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే మరొక సినిమాను ఫైనల్ చేస్తున్నాడు. ఫిలిం ఇండస్ట్రీ నెంబర్ వన్ స్థానం వైపు తనకు నమ్మకం లేదు అంటూ చెప్పే మహేష్ మరో 10 సంవత్సరాలు గడిచిపోయినా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి చిరంజీవి మాత్రమే నెంబర్ వన్ అంటూ మెగా అభిమానుల అభిమానాన్ని కొల్లగొడుతున్నాడు..   


మరింత సమాచారం తెలుసుకోండి: