రెజీనాకు ఈ మధ్య వరుసగా ఫెయిల్యూర్స్ పలకరించడంతో తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. నిత్య జీవితంలో భాగమైన శృంగార జీవితం పట్ల సెలెబ్రిటీలు సైతం బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా యంగ్ హీరోయిన్ రెజీనా శృంగార సినిమాల విషయంలో ఓపెన్ అయింది. వివరాల్లోకి పోతే.. ఇక శృంగార సంబంధిత విషయాల పట్ల అయితే హిపోక్రసీ శృతిమించి ఉంటుంది. సెక్స్ తో కూడుకున్న విషయాలు మాట్లాడాలంటే కాస్త ఆలోచిస్తుంటారు జనం.


అయితే మోడ్రెన్ డేస్ లో దీనిపట్ల కొంతవరకు మార్పు వచ్చినప్పటికీ.. అడపాదడపా ఇది కనిపిస్తూనే ఉంది. పోర్న్ సినిమాలు, పోర్న్ సంగతుల్లో దాచేస్తూ మాట్లాడటం అనేది అక్కడక్కడా కనిపిస్తోంది. సాధారణ జనాలే కాదు సెలెబ్రిటీలు సైతం పోర్న్ సంబంధిత విషయాలు చెప్పడంలో కాస్త వెనుకాముందు ఆలోచిస్తారు. కానీ మోడ్రెన్ జెనెరేషన్ అని నిరూపిస్తూ పోర్న్ పట్ల ఓపెన్ అయి ఆశ్చర్యపర్చింది యంగ్ హీరోయిన్ రెజీనా.


తాను అడల్ట్ సినిమాలు చూసేదాన్నని ఏ మాత్రం జంకకుండా కుండబద్దలు కొట్టేసింది.  ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో స్కూల్ డేస్ లో మీరు అడల్ట్ ఫిలిమ్స్ చూశారా..? అని రెజీనాను అడిగగానే ''ఓ ఎస్'' అని బదులిచ్చి ఆశ్చర్యపరిచింది. అంతేకాదు.. ఈ రోజుల్లో అదంతా కామనే కదా! అని కూడా చెప్పి ఊహించని షాకిచ్చింది రెజీనా. దీంతో పోర్న్ విషయమై ఆమె లోని ఓపెన్ నేచర్ పట్ల పాజిటివ్‌గా స్పందించారు అక్కడి జనం. 

మరింత సమాచారం తెలుసుకోండి: