ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు దాసరి తారక ప్రభు(43) అదృశ్యం అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో సంచలనంగా మారిన ఈ అదృశ్యం వెనుక ఎన్నో కోణాలు దాగిన్నాయని..ఇంతకీ దాసరి తారక ప్రభు ఏమయ్యారని దీని వెనుక ఎవరి హస్తమైనా ఉందా అని రక రకాల కథనాలు సోషల్ మీడియాలో దుమ్మురేపాయి.  అటు పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే. 

ఈ నెల 9న ప్రభు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 46లోని తన ఇంటి నుంచి ఆటోలో ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్‌కు వెళ్ళి అక్కడ చిత్తూరు బస్సు ఎక్కి వెళ్ళినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 13న  ఉదయం బయట పని ఉందంటూ భార్యాభర్తలిద్దరూ వెళ్ళిపోయారు. 2008లోనూ ప్రభు ఇలా అదృశ్యమయ్యారు. అప్పట్లో తిరిగి వచ్చిన ప్రభు తన భార్య సుశీల తనను కిడ్నాప్‌ చేసిందంటూ ఆరోపించారు.

దాసరి మరణం తరువాత కుటుంబంలో నెలకొన్న వివాదాలు తారాస్థాయికి చేరాయి. కాగా, నిన్న హైదరాబాద్ లోని తన నివాసానికి ప్రభు చేరుకున్నారు. తారక ప్రభు అదృశ్యమయ్యారంటూ ఆయన మామ సురేంద్ర ప్రసాద్ ఈ నెల 9న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఇంటికి చేరుకున్న ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

తారక ప్రభు  ఎందుకు అదృశ్యమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది.  కుటుంబసభ్యులకు ఎవరికీ చెప్పకుండా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారనే విషయమై పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: