అర్జున్ రెడ్డి హింది రీమేక్ గా వచ్చిన కబీర్ సింగ్ సినిమా ఈ శుక్రవారం బాలీవుడ్ లో రిలీజైంది. షాహిద్ కపూర్, కియరా అద్వాని జంటగా నటించిన ఈ సినిమాను అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ డైరెక్ట్ చేశారు. టీజర్, ట్రైలర్ తెలుగులో లానే హింది ఆడియెన్స్ ను అలరించగా మొదటి షో నుండి యూత్ రెస్పాన్స్ అదిరిపోగా విమర్శలు ఎక్కువయ్యాయి.


ముంబై మీడియా కూడా ఈ సినిమాపై నెగటివ్ రివ్యూస్ ఇచ్చింది. అయితే ఇవేవి కలక్షన్స్ కు అడ్డుగా మారలేదు. షాహిద్ కపూర్ కెరియర్ లో ది బెస్ట్ గా కబీర్ సింగ్ వసూళ్లు వస్తున్నాయి. ఫస్ట్ డే 20.21 కోట్లు రాబట్టిన కబీర్ సింగ్ రెండవ రోజు కూడా అదే రేంజ్ లో వసూళ్లు సాధించింది. శనివారం రోజు కూడా 22.71 కోట్లు కలెక్ట్ చేసింది కబీర్ సింగ్.


అంటే రెండు రోజుల్లోనే కబీర్ సింగ్ 42.92 కోట్లు రాబట్టింది. కేవలం రెండు రోజుల్లోనే ఈ రేంజ్ వసూళ్లు సాధించింది అంటే షాహిద్ కెరియర్ లో హయ్యెస్ట్ కలక్షన్స్ రాబట్టిన ఆర్.. రాజ్ కుమార్ 66.10 కోట్ల కలక్షన్స్ ను ఇది క్రాస్ చేయడం ఖాయమని చెప్పొచ్చు. వీకెండ్ లోనే 70 కోట్లు దాటేలా ఉన్న కబీర్ సింగ్ ఫుల్ రన్ లో 100 కోట్లు దాటేస్తుందని సిని విశ్లేషకులు చెబుతున్నారు. 


ఈమధ్య అసలు ఏమాత్రం ఫాంలో లేని షాహిద్ కపూర్ కు కబీర్ సింగ్ కొత్త జోష్ తెచ్చింది. అయితే ఈ సినిమాకు బాలీవుడ్ లో విమర్శలు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. అసలు షాహిద్ కపూర్ ఈ సినిమా ఎలా చేశాడు అన్నట్టుగా కామెంట్స్ వస్తున్నాయి. అయితే షాహిద్ కపూర్ మాత్రం నెగటివ్ కామెంట్స్ ను ఏమాత్రం పట్టించుకోకుండా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.    


మరింత సమాచారం తెలుసుకోండి: