కేతిక శర్మ గురించి మనకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈమె నటించిన సినిమాలు ఇంకా ఏమి రిలీజ్ కాలేదు. అయితే ప్రస్తుతం పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి సినిమా 'రొమాంటిక్' లో హీరోయిన్ గా నటిస్తోంది. అనిల్ పాడూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్ - ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే పాప పాపులర్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది.


కేతిక సోషల్ మీడియాలో మహా యాక్టివ్.. అందుకే హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసి చిన్నపాటి సునామీలను తెప్పిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి అదేపని చేసింది.  కొన్ని హాట్ ఫోటోలు పోస్ట చేసింది.  ఈ ఫోటోలకు "ఈ వారంలోకి చాలా ఊంఫ్ తో అడుగుపెడుతున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఊంఫ్ కి తెలుగులో ఉత్సాహం అని రఫ్ గా అనువాదం చేసుకోవచ్చు కానీ పర్ఫెక్ట్ ట్రాన్స్ లేషన్ కాదు.


  సెక్సీగా ఉండే ఉత్సాహం లాంటిది. నిజమే కదా ఆమెకు ఉత్సాహమే.. చూసిన వారికి కూడా ఉత్సాహమే! సాధారణ ఉత్సాహం కాదు.. డబల్ ఉత్సాహం!ఈ ఫోటోలలో కేతిక బ్యాక్ ఓపెన్ ఉండే ఒక టాప్ ధరించింది. టాప్ కు స్ట్రాప్స్ కూడా ఉన్నాయి కానీ అవి మరీ భూతద్దం పెట్టి చూస్తే కానీ కనపడేలా లేవు. దీంతో ఆమె బ్యాక్ అందాలను ఎంతో వయ్యారంగా వడ్డించినట్టు అయిపోయింది.  ఒక చేతిని తన పెదవులకు దగ్గరగా పెట్టుకుని సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: