యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా దాదాపు దశాబ్ధ కాలం తర్వాత హిట్ అందుకున్న సినిమా పిఎస్వి గరుడవేగ. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని మళ్లీ రాజశేఖర్ ను ఫాంలోకి వచ్చేలా చేసింది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మతో కల్కి సినిమా చేశాడు రాజశేఖర్.


ఈ నెల 28న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో గరుడవేగ డైరక్టర్ ప్రవీణ్ సత్తారు కామెంట్స్ అందరిని సర్ ప్రైజ్ చేశాయి. గరుడవేగ కన్నా కల్కి పెద్ద విజయం సాధిస్తే ఆ తర్వాత వచ్చే గరుడవేగ 2 అంతకన్నా పెద్ద విజయాన్ని అందుకుంటుందని అన్నారు. గరుడవేగ సీక్వల్ పై ఇన్నాళ్లు ఇన్నర్ టాకే వినపడ్డది.


కాని అఫిషియల్ గా ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వల్ ఉంటుందని ఎనౌన్స్ చేశారు. ఆ సినిమాకు నిర్మాతగా సి. కళ్యాణ్ వ్యవహరిస్తారని తెలుస్తుంది. అయితే గరుడవేగ తర్వాత ప్రవీణ్ సత్తారు వేరే హీరోలతో సినిమా ప్రయత్నాలు చేశాడు. బడ్జెట్ ఎక్కువ చెప్పడం వల్ల అతనితో సినిమాకు ఏ నిర్మాత ముందుకు రాలేదు.


రాజశేఖర్ తో సినిమా అంటే వారే సగం బడ్జెట్ పెట్టేస్తారు. హీరో రెమ్యునరేషన్ ఉండదు. సినిమా బిజినెస్ లోనే వాటా తీసుకుంటారు. అందుకే గరుడవేగ 2 అంటూ రాజశేఖర్ తోనే సినిమా షురూ చేస్తున్నాడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని చెబుతున్నారు. మరి గరుడవేగ 2 సత్తా ఏంటో చూడాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: