సినిమాల్లో రెచ్చిపోయి స్కిన్ షో, ఇంటిమేట్ సీన్స్ చేసే భామలు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలో కొందరు సినిమాలకే పరిమితమైతే మరికొందరు మాత్రం అది ఆఫ్ స్క్రీన్ లో కూడా కొనసాగిస్తున్నారు. సినిమాల్లో హాట్ షో చేయడం లేదంటే ఫోటో షూట్ పేరుతో ప్రేక్షకులను వల్లో వేసుకోవడం బాలీవుడ్ భామలకు అలవాటుగా మారింది.       


అయితే ఇది కాస్త ముదిరి పాకాన పడ్డట్టుగా పూనం పాండే, షెర్లిన్ చోప్రా వంటి తారలు ఇప్పుడు మరింత రెచ్చిపోతున్నారు. ఒంటి మీద నూలుపోగు లేకుండా దర్శనమిస్తున్నారు ఈ భామలు. వాళ్ల డిక్షనరీలో సిగ్గు అనే పదం తీసేశారనుకుంటా అందుకే విచ్చలవిడి అందాల ప్రదర్శనతో దుమ్మురేపుతున్నారు.


వీరి ఫాలోవర్స్ సంఖ్య కూడా ఎక్కువవడం వల్ల వీళ్లు మరింత రెచ్చిపోతున్నారు. పూనం పాండే దారిలోనే షెర్లీన్ చోప్రా కూడా ఇప్పుడు హాట్ వీడియోలతో అదరగొడుతుంది. వీళ్ల హాట్ షోస్ కు స్పెషల్ యాప్ ఒకటి సిద్ధం చేసుకున్నారు. పూనం పాండే యాప్ ఇప్పటికే ఫేమస్ అవగా ఇప్పుడు షెర్లీన్ చోప్రా కూడా తన యాప్ రెడీ చేసింది.


ఇన్ స్టాగ్రాంలో ఓ చిన్న వీడియో పెట్టి ఊరించడం దానికి కొనసాగింపు వీడియో కోసం తమ యాప్ డౌన్ లోడ్ చేసుకోమనడం వీళ్లకు అలవాటుగా మారింది. పూనం పాండే రచ్చనే తట్టుకోలేకపోతుంటే ఇప్పుడు షెర్లీన్ చోప్రా కూడా ఇలాంటి పనులే చేస్తుంది. వీళ్లు ఇలా చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని కొందరు వాదిస్తుంటే.. వాళ్లేమైనా అందరిని చూడమన్నారా కావాల్సిన వారు యాప్ డౌన్ లోడ్ చేసుకోండనేగా అంటున్నారని కొందరు శృంగార ప్రియులు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ రచ్చ మాత్రం మాములుగా లేదని చెప్పొచ్చు.   



మరింత సమాచారం తెలుసుకోండి: