నిన్న రిలీజైన ‘వాల్మీకి’ ప్రి టీజర్లో వరుణ్ తేజ్ లుక్ చూసిన వారందరూ షాక్ అవ్వడమే కాకుండా ఈ లుక్ కోసం వరుణ్ తేజ్ పడ్డ కష్టం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంలో ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో వరుణ్ పక్కన ఉన్న నటుడు ఎవరు అంటూ ఆరాలు తీయడంతో ఆ కుర్రవాడి రహస్యం బయట పడింది. 

వరుణ్ తేజ్ పక్కన కనిపిస్తున్న ఆ స్టార్ పేరు అధర్వ. వాస్తవానికి ఈ నటుడు గురించి టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో కూడ చాలామందికి తెలియదు. ఈ ‘వాల్మీకి’ మూవీ తమిళంలో హిట్ అయిన ‘జిగర్ తండ’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఈమూవీ కథలో విలన్ పాత్ర హీరో స్థాయిని మించి ఉంటుంది. 

అందుకే ఈమూవీలో విలన్ పాత్రను వరుణ్ తేజ్ చేస్తున్నాడు. దీనితో ఈమూవీ తమిళ మాతృకలో హీరో సిద్ధార్ద్ చేసిన పాత్రకు ముందుగా నాగశౌర్య పేరును పరిశీలించినా ఆ పాత్రకు అతడు సరిపోడు అని భావించడంతో ఆ హీరో పాత్రకు అధర్వను ఎంచుకున్నారు. తమిళ ఫిలిం ఇండస్ట్రీలో చాల అతి తక్కువ కాలంలో మంచి నటుడుగా పేరు తెచ్చుకున్న అధర్వ 1990 ప్రాంతంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘హృదయం’ చిత్రంలో హీరోగా నటించిన మురళి కొడుకు ఈ అధర్వ. 

కోలీవుడ్ లో మంచి విజయం సాధించిన ‘అంజలి ఐపీఎస్’ మూవీలో అధర్వ నయనతార తమ్ముడుగా కీలక పాత్ర చేసాడు. ఇక నిఖిల్ నటించిన ‘అర్జున్ సురవరం’ మాతృక తమిళ మూవీ ‘గణిదన్’ లో అధర్వ హీరో. బాలా దర్శకత్వంలో  వచ్చిన ‘పరదేశి’ అనే సినిమాలో అధర్వ ప్రదర్శించిన అద్భుతమైన నటనకు అనేక అవార్డ్ లు కూడ వచ్చాయి. హరీష్ శంకర్ ప్రోత్సాహంతో ‘వాల్మీకి’ మూవీలో వరుణ్ తేజ్ తో కలిసి నటిస్తున్న ఈ యంగ్ హీరో వివరాలు నిన్న విడుదలైన ‘వాల్మీకి’  ప్రీ టీజర్ ద్వారా బయట పడింది..


మరింత సమాచారం తెలుసుకోండి: