ఏ హీరో అయినా తను సెలెక్ట్ చేసుకున్న కథలో కొత్తదనం.. ఎమోషనల్ డ్రామా సరిగ్గా కుదిరితే ఆ సినిమా గ్యారెంటీగా సక్సస్ అవుతుందనడానికి టాలీవుడ్‌లో రీసెంట్‌గా వచ్చిన జెర్సీ సినిమా పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్‌లో ఆసక్తిని రేకెత్తించే కథనంతో తెరకెక్కించిన సినిమా. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాలో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించాడు. గ్యారెంటీ హిట్ కొడతానని చెప్పి మరీ నాని జెర్సీతో హిట్ అందుకున్నాడు. మొదటిరోజు డివైడ్ టాక్ వచ్చినా ఒడిదుడుకుల్ని తట్టుకుని లాంగ్ డ్రైవ్ లో పెట్టుబడుల్ని రికవరీ చేయగలిగింది. 


అంతేకాదు ఈ సినిమాలో నాని నటనకు.. గౌతమ్ దర్శకత్వ ప్రతిభకు క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఇక జెర్సీ లాంటి కథాంశాలకు ఉత్తరాది ఆడియెన్స్ లో ఆదరణ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తదనం.. ప్రయోగాత్మక సినిమాలను ఆదరించడానికి ముందుంటారు . అందుకే ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నారు. హిందీ వెర్షన్ కి కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారని లేటెస్ట్ న్యూస్. 


ఇక నేచురల్ స్టార్ నాని పోషించిన పాత్రలో బాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తారట. అయితే ఈ రీమేక్ కి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. జెర్సీ సినిమాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు జెర్సీ సినిమాని చైనాలోనూ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దానికి సంబంధించిన అప్ డేట్ త్వరలో రానుందట. 



మరింత సమాచారం తెలుసుకోండి: