"నటుడిగా నన్ను ఆదరిస్తున్నారంటే అందుకు నాన్న సాయికుమార్‌ అభిమానులే కారణం. అందుకే చాలామందికి కనెక్ట్‌ అయ్యాను. నాన్నగారి వాయిస్‌, ఆహార్యం, వాగ్ధాటికి అభిమానులే కాకుండా ప్రేక్షకులుగా ఫిదా అయ్యారు. చాలా మంది 'మీ నాన్నలా పోలీసు పాత్రలు చేయమని అడిగారు'. కానీ నేనెలా ఆయనలా ఆ పాత్రలు చేస్తాను. అందుకు నాన్నగారే ఫేమస్‌'' అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పారు ఆది. ఇంకా...

 

డైమండ్‌ రత్న బాబు నాకు కథ గురించి ఫోన్‌ చేసినప్పుడే.. 'ఐ వాంట్‌ టు డైరెక్ట్‌' అని మెసేజ్‌ పంపారు. ఒక రైటర్‌ తన కథ మీద ఎంత నమ్మకం ఉంటే నేనే డైరెక్ట్‌ చేస్తాను అని చెప్తాడు. అది కాకుండా ఇంత కాంప్లికేటెడ్‌ స్టోరీని చాలా ఈజీగా నేరేట్‌ చేశారు. అప్పుడే నేను అనుకున్న ఈ సినిమాకు రత్నాబాబు పర్ఫెక్ట్‌ అని. మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా మంచి టీంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

 

మిస్తీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసింది. రెండు క్యారెక్టర్ల మధ్య గందరగోళం అయ్యే అమ్మాయి. గ్లామరస్‌గా ఉంటూనే నటనకి మంచి అవకాశం ఉండే క్యారెక్టర్‌. అలాగే మరో హీరోయిన్‌గా నైరాశ కూడా ప్రేక్షకులని అలరిస్తుంది.

 

సాయి కిరణ్‌ అడివి దర్శకత్వంలో అర్జున్‌ పండిట్‌ అనే కశ్మీర్‌ పండిట్‌ క్యారెక్టర్‌ చేస్తున్నాను. ఈ కథ వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నిజ సంఘటనతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రతి భారతీయుడూ గర్వించే విధంగా పవర్‌ఫుల్‌ ఇంటెన్స్‌ ఉన్న దేశభక్తితో కూడిన చిత్రం. షూటింగ్‌ పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది.. అని చెప్పుకొచ్చాడు...


మరింత సమాచారం తెలుసుకోండి: