దాదాపు 60 ఏళ్ళ సినీ ప్రస్థానంలో  నటిగా, దర్శకురాలిగా ఎన్నో భిన్న పాత్రలు పోషించారు విజయ నిర్మల. 44 చిత్రాలకు దర్శకత్వం వహించి ఏ మహిళా దర్శకురాలూ సాధించలేని ఘనతను సాధించడమే కాదు, గిన్నిస్‌ రికార్డును సైతం సొంత చేసుకున్నారు.  ఒక మహిళా దర్శకురాలిగా న్నో విజయాలు సొంతం చేసుకున్నారు. ‘కవిత’(మలయాళంలో తొలి చిత్రం) చిత్రంతో దర్శకత్వం చేయడం ప్రారంభించిన ఆమె కెరీర్‌లో ‘మీనా’(తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం).

 

ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో-హీరోయిన్‌ కలిసి నటించిన చిత్రం విజయం సాధించిందంటే, దర్శక-నిర్మాతలు మళ్లీ అదే జోడీతో సినిమా తీయడానికి ఆసక్తి చూపుతారు. ప్రేక్షకుల సైతం ఆ హిట్‌ పెయిర్‌ మళ్లీ, మళ్లీ రిపీట్‌ కావాలని అనుకుంటారు. అలా ఇప్పటివరకూ చాలామంది నాయకనాయికలు వెండితెరపై సందడి చేశారు. అలాంటి వారిలో కృష్ణ-విజయ నిర్మల ఒకరు.

 

వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘సాక్షి’. బాపు దర్శకత్వం వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 47 చిత్రాల్లో నటించారు. ఇదొక రికార్డు. ఇంతవరకూ ఏ జోడీ కలిసి ఇన్ని సినిమాలు చేయలేదు. వీటిల్లో ‘టక్కరి దొంగ చక్కని చుక్క’, ‘విచిత్ర కుటుంబం’, ‘బందిపోటు భీమన్న’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘పండంటి కాపురం’, ‘దేవుడు చేసిన మనుషులు’, ‘మీనా’, ‘అల్లూరి సీతారామరాజు’, ‘దేవదాసు’, ‘పాడిపంటలు’, ‘శ్రావణమాసం’ ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి.

 

అయితే విజయ నిర్మల గారు ఇప్పటి వరకు 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆమె యాభై చిత్రాలు పూర్తి చేయాలనుకుందట. కానీ ఆ కల నెరవేరకుండానే కన్ను మూశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చూసిన తర్వాత ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో సినిమా చేయాలని అనిపించిందట. కానీ ఆ సినిమా కార్య రూపం దాల్చలేదు.దీంతో ఆమె కల నెరవేరలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: