లక్ష్మీ రాయ్ పేరు మార్చుకున్న పెద్దగా కలిసి రావడం లేదు. దీన్నే బ్యాడ్ లక్ అంటారు. రాయ్ లక్ష్మీని ఇప్పటి వరకు గ్లామర్ స్టార్ గానే ప్రేక్షకులు చూశారు. తెలుగు.. తమిళంతో పాటు హిందీలో కూడా నటించిన రాయ్ లక్ష్మీ ఇప్పటి వరకు స్కిన్ షోలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ నటించింది. ఇప్పటి వరకు గ్లామర్ హీరోయిన్ గానే గుర్తింపు దక్కించుకున్న రాయ్ లక్ష్మీని తాను కొత్తగా చూపించబోతున్నాడు దర్శకుడు వినో వెంకటేష్. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన 'సిండ్రెల్లా' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది.


కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వినో వెంకటేష్ మల్టీ మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉంది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ జే సూర్య దగ్గర కూడా నాలుగు సంవత్సరాల పాటు అసిస్టెంట్ గా చేసిన వెంకటేష్ 'సిండ్రెల్లా'తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా డిఫ్రెంట్‌గా ఉండటంతో పాటు రాయ్ లక్ష్మీని కొత్తగా చూడబోతున్నామని సమాచారం.


'సిండ్రెల్లా' సినిమా దెయ్యం బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కిన సినిమా అట. అయితే గతంలో వచ్చిన సినిమాలకు ఈ సినిమాకు చాలా తేడా ఉంటుంది. రెగ్యులర్ హర్రర్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాల తరహాలో కాకుండా చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలోని రాయ్ లక్ష్మీ పాత్ర ఆమె ఇప్పటి వరకు సంపాదించుకున్న ఇమేజ్ ను బ్రేక్ చేస్తుందని లేటెస్ట్ న్యూస్. అంతే కాకుండా ఈ సినిమా రాయ్ కెరీర్ లోనే ది బెస్ట్‌గా నిలిచిపోయే సినిమా అవుతుందట. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర బృందం చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: