టాలీవుడ్‌లో 2019 సంవ‌త్స‌రం ఫ‌స్ట్ హాఫ్ పూర్త‌య్యింది. ఆరు నెల‌ల కాలంలో ఎఫ్ 2, మ‌హ‌ర్షి లాంటి రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. ఫ‌స్టాఫ్లో హిట్ల కంటే ప్లాపులే ఎక్కువుగా ఉన్నాయి. జ‌న‌వ‌రిలో సంక్రాంతికి వ‌చ్చిన ఎఫ్ 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ అయితే, ర‌జ‌నీ పేట‌, బాల‌య్య కథానాయ‌కుడు, చ‌ర‌ణ్ విన‌య‌విధేయ రామ అట్ట‌ర్ ప్లాప్ అయ్యాయి. ఆ త‌ర్వాత‌ అఖిల్‌కు మిస్ట‌ర్ మ‌జ్నుతో మూడో ప్లాప్ ద‌క్కింది. ఫిబ్ర‌వ‌రిలో రెండు బయోపిక్‌లు వ‌చ్చాయి. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా వ‌చ్చిన యాత్రకు ప్ర‌శంస‌లు బాగున్నా.. క‌మ‌ర్షియ‌ల్‌గా అంత స‌క్సెస్ కాలేదు. 


ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ పార్ట్‌-2 మ‌హానాయ‌కుడు ఘోర‌మైన ప్లాప్‌తో ఎన్టీఆర్ ప‌రువు తీసేసింది. మార్చిలో క‌ళ్యాణ్‌రామ్‌కు 118 హిట్ ఇచ్చింది. అడ‌ల్ట్ సినిమా చీకటి గదిలో చితక్కొట్టుడు టార్గెట్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. రామ్‌గోపాల్‌వర్మ తీసిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణ‌లో రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది. కొణిదెల పిల్ల సూర్య‌కాంతం కూడా ప్లాపే. ఆ త‌ర్వాత స‌మ్మ‌ర్ సీజ‌న్ స్టార్ట్ అయ్యాక వ‌చ్చిన నాగ‌చైత‌న్య మ‌జిలీ  - నానీ జెర్సీ - సాయితేజ్ చిత్ర‌ల‌హ‌రి ప‌ర్వాలేద‌నిపించాయి. మ‌జిలీ మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.


కాంచ‌న సీరిస్ స‌త్తాను మ‌రోసారి కాంచ‌న‌-3 చాటి చెప్పింది. మ‌హ‌ర్షితో మ‌హేష్ మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అల్లు శిరీష్ ఏబీసీడీ, బెల్లంకొండ సీత అట్ట‌ర్ ప్లాప్ అయ్యాయి. మేలో ఫలక్‌నుమా దాస్ హైద‌రాబాద్‌లో బాగా ఆడింది. ఇక జూన్‌లో బాక్సాఫీస్ మ‌ళ్లీ డ‌ల్‌గానే ఉంది. హిప్పీ, సెవెన్‌, ఫస్ట్‌ ర్యాంక్‌ రాజు ప్లాప్‌ల‌కే ప్లాప్ అయ్యాయి. జూన్ చివ‌ర్లో సాయి శ్రీనివాస ఆత్రేయ, తాప్సీ నటించిన గేమ్‌ ఓవర్‌, మ‌ల్లేశంకు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. చివ‌ర్లో వ‌చ్చిన క‌ల్కి యావ‌రేజ్‌గా ఉంటే, బ్రోచేవారెవరురా హిట్ టాక్ తెచ్చుకుంది.


ఏదేమైనా 2019లో టాలీవుడ్ ఫ‌స్టాఫ్ ప‌రంగా చూస్తే మ‌హా అయితే నాలుగైదు సినిమాలు మాత్ర‌మే హిట్ అయితే మిగిలిన సినిమాలు అన్ని డిజాస్ట‌ర్ అయ్యాయి. ఇప్పుడు అంద‌రి క‌న్ను సెకండ్ హాఫ్ మీదే ఉంది. సాహో, సైరా, మ‌న్మ‌థుడు 2 లాంటి క్రేజీ సినిమాలు ఈ ఆరు నెల‌ల్లోనే రానున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: