‘నాకు నా డైలాగ్‌లే గుర్తు ఉండవు.. మా నాన్నగారి డైలాగ్‌లా.. కెవ్వూ’ అనే కేకతో మొదలైన మంచులక్ష్మి స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత లీడ్‌లో నటించిన ‘ఓ బేబీ’ మూవీ జూలై 5న విడుదలకు రెడీ కావడంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. మంచు లక్ష్మి మాట్లాడుతూ..

 

నా తరువాత మాట్లాడేవాళ్లు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఇంగ్లీష్‌లో మాట్లాడితేనే తొందరగా మాట్లాడగలను. తెలుగు అంటే రోజంతా పడుతుంది. (ఈలోపు ఆడియన్స్ తెలుగులోనే మాట్లాడని కేకలు వేయగా). ఏంటీ.. తెలుగులోనే మాట్లాడాలా? చచ్చారు పోండి.. అయితే తెలుగులోనే మాట్లాడతాను. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ బెస్ట్ విషెష్.

 

ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ అంకుల్.. (తలవంచి నమస్కారం పెడుతూ..) ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మనోజ్ ఉండి ఉంటే.. కేవలం ఆయన గురించే మాట్లాడేవాడు. ఎందుకంటే ‘జంబలకిడిపంబ’ సినిమా వందసార్లు కాదు కదా.. 150, 1000 సార్లుకు పైగా ఆ క్యాసెట్‌ అరిగేదాకా స్కూల్ కాగానే ఆ సినిమానే చూసేవాళ్లం. దీంతో పాటు ‘ఏప్రిల్ 1 విడుదల’ ఇలా ఎన్నో మంచి సినిమాలతో అలరించారని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

 

ఇక మంచులక్ష్మి స్పీచ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఏంటమ్మా.. ‘జంబలకిడిపంబ’ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్‌నా? మరి నరేష్ ఎవరు? మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకు మంచుఅక్కా అంటూ పంచ్‌లు పేలుస్తున్నారు. ఇక యాంకర్ ఝాన్సీ యాంకరింగ్ కూడా బాగా ఓవర్‌గా ఉందంటూ దయచేసి మీరు యాంకరింగ్ చేస్తే బాగుంటుంది.. ఓవరాక్షన్ వద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: