ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ల మద్య భేదాభిప్రాయాలు వచ్చాయని..అందుకే చిరు తమ్ముడు నాగబాబు, బాలకృష్ణను యూట్యూబ్ సాక్షింగా ఒక్క ఆట ఆడుకున్నారని..ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారని తెగ వార్తలు వచ్చాయి. వాస్తవానికి సినీ పరిశ్రమలో స్టార్ హీరోల మద్య ఎలాంటి ఇగోలు ఉండవని అందరూ కలిసి మెలిసి ఉంటారని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా ఇప్పుడు మరోసారి చిరంజీవి, బాలకృష్ణ ఒకే పార్టీలో తెగ సందడి చేశారు.  ప్రముఖ సీనియర్ దర్శకుడు కోదండరామిరెడ్డి సోమవారం 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. 

గత రాత్రి ఈ జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా జరిగాయి.  టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న  కోదండ రామిరెడ్డి పేరు వినగానే వెంటనే చిరంజీవీ గుర్తొస్తాడు. వీరిద్దరి కాంబినేషన్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.  స్టార్ హీరోలతో మాస్ కే జోష్ వచ్చేలాంటి సినిమాలు చేసిన మాసివ్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి.

వరుసగా 16 సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు. శ్రీధర్, చంద్రమోహన్ నటించిన ‘సంధ్య’ అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు కోదండరామిరెడ్డి.  అభిలాష తర్వాత కోదండరామిరెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో కమర్షియల్ సినిమా లెక్కలను బ్లాస్ట్ చేసేలా ఖైదీ వచ్చింది.  ఈ సినిమాతో అప్పటి వరకూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నాల్లోనే ఉన్న చిరంజీవి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరో అయ్యాడు.


నిన్న జరిగిన జన్మదిన వేడుకలకు  ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్‌ రాజు, అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీతదర్శకుడు కోటి తదితరులు పాల్గొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: