మనిషి నమ్మినా నమ్మకపోయినా..ప్రపంచంలో దేవుడు ఉన్నాడని ఎంతగా నమ్ముతారో దెయ్యం ఉందన్న విషయాన్ని కూడా నమ్ముతారు.  దైవ పూజలు ఎంత భక్తితో చేస్తారో, దెయ్యం పూజలు అంత భయంగా చేస్తారు.  పుట్టినప్పటి నుంచి దేవుడిపై ఎంత భక్తి భావాన్ని పెంచుతారో తల్లిదండ్రులు బూచీ వస్తుందని భయపెడతారు.  ఇక తెలుగు సినిమాల్లో ఒకప్పుడు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన లతాశ్రీ తెలుగు ప్రేక్షకులు సుపరిచితమే.  ఆమె తెలుగు తో పాటు కన్నడ మూవీస్ లో కూడా నటించారు.

లతాశ్రీ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తెలుగు మూవీస్ లో కన్నా ఎక్కువగా కన్నడ మూవీస్ లోనే నటించానని..ఒక కన్నడ సినిమా షూటింగు హాస్పిటల్లో జరుగుతోంది. అర్ధరాత్రివేళలో అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ లో కాస్త విరామం వచ్చిందని నడుచుకుంటూ పై అంతస్థులోకి వెళ్లాను. 

అక్కడ ఓ మహిళ తెల్ల చీర కట్టుకొని..జుట్టు విరబోసుకొని గోడపై కూర్చోవడం చూశానని ఆ సమయానికి తన అలికిడి వినగానే ఉన్నట్టుండి మాయమైందని వెంటనే అది దెయ్యమే అనుకొని నా ప్రాణాలు పోయినంత పనైందని అన్నారు. 

అయితే పై అంతస్థులో మార్చురీ ఉన్న విషయం తనకు తెలియక వెళ్లానని వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ కిందకు వచ్చానని చెప్పింది. ఇది నిజం నా జీవితంలో జరిగిన భయంకర సంఘటన.. నమ్మకపోయినా నిజంగానే నేను దెయ్యాన్ని చూశాను అని ఆమె చెప్పుకొచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: